అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి….
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. కింగ్ నాగార్జున సోదరుడు వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సుమంత్, సుప్రియా, నాగసుశీల, సుశాంత్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే తన సోదరుడు ఆదిత్యకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ ఫొటోలో నాగచైతన్య భార్య సమంత కనిపించకపోవడంతో.. సమంత ఎక్కడ అంటూ ప్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య, వెంకటేశ్‌తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామా’ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది.