ఫాస్టాగ్..ఫాస్టాగ్..ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తోంది…


జర్నీని సులభతరం చేసేందుకు కేంద్రం ఈ కొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనిపేరే ఫాస్టాగ్. జర్నీ చేస్తున్న సమయంలో టోల్ గేట్ల వద్ద ఫీజులు కట్టడం కంపల్సరీ. ఇందుకోసం చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పండుగ సమయం, సెలవుల సమయంలో ఈ రద్దీ ఎక్కువగానే ఉంటుంది.

దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనానికి, నిరుత్సాహానికి గురవుతుంటారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తొలుత డిసెంబర్ 01వ తేదీ నుంచి అమల్లోకి తీసుకరావాలని అనుకున్న..డేట్‌ను పెంచారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం నుంచి అమలు కానుంది. టోల్ ప్లాజా వద్ద ఆగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే..2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని..25 శాతం ఫాస్టాగ్ లైన్స్ తాత్కాలికంగా హైబ్రిడ్ లేన్స్‌గా మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ లైన్లలో ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులను అనుమతినిస్తారు. కానీ ఇందుకు సమయం పెట్టింది. నెల రోజుల పాటు మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

*ఎలా పనిచేస్తుంది : -*

* వాహనం ముందు అతికించ బడిన ఫాస్టాగ్ స్టిక్కర్‌ను టోల్ ప్లాజా సిబ్బంది స్కానింగ్ చేస్తారు.

* వెంటనే దానికి అనుసంధానమైన ప్రీపెయిడ్ లేదా..సేవింగ్స్ ఖాతాల నుంచి టోల్ రుసుము ఆటోమెటిక్‌గా ఖర్చయిపోతుంది.

* వినియోగదారులు తమ ఖాతాలో తగిన డబ్బు ఉంచుకుంటే సరిపోతుంది.

* టోల్ ప్లాజాలో ఒక్క లైన్ మినహా..మిగిలవన్నీ..ఫాస్టాగ్ లైన్లుగా మార్చాలని NHAI ఇప్పటికే నిర్ణయించింది.

* డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ లేని వెహికల్స్ ఆ ఒక్క లైన్‌లోనే నగదు చెల్లించి పోవాల్సి ఉంటుంది.

* పొరపాటున ఫాస్ట్ ట్యాగ్ లైన్ లోకి వెళితే..రెట్టింపు రుసుము వసూలు చేస్తారు.

* ఫాస్టాగ్ లభించే ఫ్లాట్‌‌ఫామ్స్ చాలానే ఉన్నాయి. అందులో ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఒకటి.

* SBI, ICICI, HDFC, Axis, Kotak Mahindra నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ కార్యక్రమంలో భాగస్వాములై ఉన్నాయి.

*FASTagతో ప్రయోజనాలివే :*

* జాతీయ రహదారి టోల్ ప్లాజాల దగ్గర FasTags పాటు ఇతర చెల్లింపులు అంగీకరించాలని నేషనల్ అథార్టీ ఆఫ్ ఇండియా (NHA) నిర్ణయం తీసుకుంది.

* హైవే కౌంటర్లలో ఫాస్టాగ్‌లను ఉచితంగా ఇస్తుంది. సొంతంగా రీ ఛార్జీ చేసుకోవాలి.

* బ్యాంకుల నుంచి లేదా అమెజాన్, ఆన్ లైన్‌లో FasTags తీసుకోవచ్చు. రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

* బ్యాంకులు, IHMCL/NHAIలు ఏర్పాటు చేసిన 28 వేల 500 పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా విక్రయిస్తారు.

* ఆర్టీఓ, కామన్ సర్వీసు సెంటర్లు, ట్రాన్స్ పోర్టు హబ్స్, బ్యాంకు బ్రాంచీలు, ఎంచుకున్న పెట్రోల్ బంకులున్నాయి.

* ఫాస్టాగ్‌‌లను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, పేటీఎం, 12 వేల బ్యాంకుల శాఖలలో అందుబాటులో ఉంచారు.

* ఫాస్టాగ్ కోసం.. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), వాహన యజమాని పాస్ పోర్టు, పాస్ పోర్టు సైజు ఫోటోలు, వాహనం యొక్క కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

* వాహనానికి సంబంధించిన వివరాల కోసం ఫాస్ట్ ట్యాగ్ మొబైల్ యాప్ ద్వారా చూసుకోవచ్చు.

* ఫాస్టాగ్ పోర్టల్‌ లాగిన్ కావాలి. టాప్ అప్ ఆఫ్షన్ ఉంటుంది. వాలెట్ ఐడీని ఎంచుకోని రీఛార్జ్ చేయాలి.

* ఒకవేళ KYC హోల్డర్ అయితే.. ఫాస్ట్ ట్యాగ్ ప్రీపెయిడ్ ఖాతాలో ఒకేసారి 10 వేలు కంటే ఎక్కువ జమ చేయడానికి అనుమతి ఉండదు.

* పూర్తి KYC ఉన్న వారికి మాత్రం లక్ష వరకు జమ చేయవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు.

About The Author