పౌరసత్వ సవరణ బిల్లుకు నేను వ్యతిరేకం, CAB నిరసన కార్యక్రమానికి హాజరు అవుతాను: ఎంపీ శ్రీ కేశినేని నాని


ఈరోజు విజయవాడ కేశినేని భవన్ నందు ముస్లిం ప్రజాసంఘాలు అన్ని కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని గారికి ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. పౌరసత్వ సవరణ బిల్లుకు మొన్న జరిగిన పార్లమెంట్ సభలో విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు రాజ్యాంగ స్ఫూర్తిని మరియు ఆర్టికల్ 14 మరియు 21 తీసుకు వచ్చిన ఈ అసమానత బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం నిజంగా అభినందనీయం అని అన్ని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా కేసినేని నాని గారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఇదే దేశ ప్రగతికి మూలమంత్రం అన్న నినాదంతో ముందుకు వెళ్తున్న టువంటి ఘనచరిత్ర కలిగిన దేశం మన భారత దేశం ఇటువంటి భారతదేశంలో కులాలకు మతాలకు వ్యత్యాసం చూడకుండా అందరికీ సమానంగా చూడాల్సిన ఎటువంటి బాధ్యత స్ఫూర్తిని మన రాజ్యాంగం కనిపిస్తుంది కానీ దానికి వ్యతిరేకంగా తీసుకొని వచ్చిన ఏదైతే పౌరసత్వ సవరణ బిల్లు ఉందో దానిని నేను నా వ్యక్తిగతంగా వ్యతిరేకించడం జరిగింది మరియు పార్లమెంట్లో వాకౌట్ చేయడం జరిగింది రేపు 19వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర నిరసన కార్యక్రమాలకు సైతం నేను హాజరయ్యే నా నిరసన గళాన్ని మరల తిరిగి వినిపిస్తానని పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో విజయవాడ ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు ఫత్ ఉళ్ళ, ముజాహిద్, హబీబ్ రియాజ్, అహ్మద్, ఇక్బాల్, మౌలానా మక్బూల్, న్యాయవాది మతిన్, మొహిద్దిన్, జబీ, ఫిరోజ్, డాక్టర్ రెహమాన్, మౌలానా హుస్సేన్, జమాతే ఇస్లామి హింద్, జమీయతే ఉలేమా ఏ హింద్ ప్రతినిధులు, భారీఎత్తున మహిళలు సైతం పాల్గొన్నారు.

About The Author