జనవరి 2వ వారంలోగా నిర్భయ కిరాతకులకు ఉరి…
జనవరి 2వ వారంలోగా నిర్భయ కిరాతకులకు ఉరి…
చివరి అవకాశమిచ్చిన జైలు అధికారులు…
నిర్భయ అత్యాచారం కేసులో నలుగురు నిందితులు తాజాగా ఉరిశిక్ష అమలుపై నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష పడ్డ నలుగురు ఖైదీలను ఉరి తీయబోతున్నారన్న సమాచారంతో నోటీసులు జారీ చేయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. అక్టోబర్ నెలలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం జారీ అయిన నోటీసులను పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశం లేదని, అందువల్ల తాజాగా నోటీసులు ఇచ్చి క్షమాభిక్ష కోరుకునే అవకాశం వుంటే వినియోగించుకోవాలని నిందితులకు సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు కూడా నిర్భయ కిరాతకులకు వారం రోజుల గడువు ఇస్తూ క్షమాభిక్ష కోరుకునే అవకాశం కల్పించారు. జనవరి 7వ తేదీన కోర్టు నలుగురు నిందితులను ఉరి తీయాలంటూ ఆదేశాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. దీన్నిబట్టి జనవరి రెండో వారంలోగానే నిందితులను ఉరి తీసే అవకాశముంది.