నిర్భయ’ దోషి పవన్ మైనర్ పిటిషన్ కొట్టివేత – లాయర్ కి రూ.25 వేలు జరిమానా…


న్యూ ఢిల్లీ – ‘నిర్భయ’ దోషి పవన్ కుమార్ గుప్తా తాను మైనర్ ను అంటూ వేసిన రివ్యూ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా ఈ పిటిషన్ వేసి తమ కాలాన్ని వృదా చేసినందుకు పవన్ లాయర్ ఎపి సింగ్ కు రూ 25 వేలు జరిమానా విధించింది.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోెరుతూ బార్ కౌన్సిల్ ను ఆదేశించింది.. కాగా నిర్భయ ఘటన జరిగే సమయానికి తాను మైనర్ ని అని, ఐపీసీ ప్రకారం తనను ఉరితీయడం కుదరదంటూ పవన్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈరోజు ఉదయం ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్బంగా ముందుగా, దోషి తరఫు న్యాయవాది తమ వాదనను వినిపించారు. పవన్ ‘మైనర్’ అని నిరూపించుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లను దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరడంతో జనవరి 24వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. అయితే, ఈ పిటిషన్ పై నిర్భయ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ మేజర్ అంటూ అన్ని డాక్యుమెంట్స్ ను సబ్ మిట్ చేశారు.. కావాలనే కేసును తప్పు దోవ పట్టిస్తున్నారంటూ ఆధారాలను కోర్టు ముందుంచారు. దీంతో వాయిదా వేస్తూ ఇచ్చిన ఆర్డర్ ను రీకాల్ చేసింది. కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ పవన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.25 వేలు జరిమానా విధించింది. ఏపీ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ కు సూచించింది.

About The Author