భారీచోరీ “యాక్షన్”…పోలీసుల కౌంటర్ “రియాక్షన్”…


~దొంగతనం జరిగినట్లు చిత్రీకరణ…
~జమ్మికుంటలో సంచలనం సృష్టించిన ఘటన…
~700 గ్రాముల బంగారం,6కిలోల వెండి అపహరించినట్లు దరఖాస్తు…
~నేరం జరిగినట్లు నిందితుల హైడ్రామా….దానికి తగ్గట్లు హైరానా…
~పోలీసుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం…సీసీ కెమెరాల ప్రత్యేక పాత్ర…
~ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు…24 గంటల్లోనే కేస్ చేదన…

*~వివరాలు వెల్లడించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి…*

జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేష్ మరియు కాసుల భాస్కర్ అను అన్నదమ్ములు గాంధీ చౌక్ లో గల తమ యొక్క శ్రీ విజయ లక్ష్మి ట్రేడర్స్ & జ్యూవెల్లర్స్ లో 2019 డిసెంబర్ 31 రోజున చోరీ జరిగినట్లుచిత్రీకరించి,భారీగా సొత్తు దొంగతనం జరిగినట్లు తెలుపగా ,కేసును ఛాలెంజ్ గా తీసుకొని 24 గంటల్లోనే వీరు ఇద్దరే కలిసి బ్యాంక్ రుణాలను దూరాశతో ఎగ్గొట్టాలనే దొంగతనం నాటకం ఆడినట్లు నిర్దారించి,సవాల్ కేసును ఛేదించిన *జమ్మికుంట పోలీసులు* ….

*నిందితులు మాస్టర్ ప్లాన్ తో నేరం జరిగినట్లు చిత్రీకరణ…*

జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేష్ మరియు భాస్కర్ అను ఇద్దరు అన్నదమ్ములు పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియా లో శ్రీ విజయ లక్ష్మి ట్రేడర్స్ & జ్యూవెల్లర్స్ నడుపుకుంటూ జీవిస్తున్నారు….ఇట్టి నిందితులు వ్యాపార నిమిత్తం వివిధ బ్యాంక్ లలో అధిక మొత్తంలో రుణాలు,అలాగే ఎస్బిఐ బ్యాంక్ నందు ముద్రలోన్ కూడా భారీగా తీసుకోవడం జరిగింది…నిందితులు ఇద్దరు ఇట్టి లోన్ డబ్బులతో బంగారం,వెండి కొనుగోలు చేసి,వ్యాపారం నిర్వహిస్తున్నారు… ఎలాగైనా ఇట్టి బ్యాంక్ లను మోసం చేసి,వారు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టాలనే నెపంతో పక్కాగా మాస్టర్ ప్లాన్ చేసుకొని,దాని ప్రకారం గత నెలలో బంగారం,వెండి కొనుగోలు చేసి,షాప్ పేరుపై బిల్లులు తీసుకున్నారు…ఇట్టి సొత్తును దొంగతనం జరిగినట్లు నమ్మించి తద్వారా బ్యాంక్ లోన్,ముద్ర లోన్ లపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని,మోసం చేయాలని నిర్ణయించుకున్నారు..వారి ప్లాన్ లో భాగంగా డిసెంబర్ 31,2019 న వారి ఇంట్లో బీరువాలను పగలగొట్టి,ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి,దొంగతనం జరిగినట్లు చిత్రీకరించి,సొత్తును మొత్తం వేరు వేరు ప్రదేశాల్లోకి మార్చారు…అట్టి ప్లాన్ లో భాగంగా నిందితుడైన భాస్కర్ ఇంటికి తాళం వేసి, తన యొక్క భార్యకి బాగులేదని,హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పి,వారి యొక్క కుటుంబ సభ్యులతో కార్ లో వరంగల్ కి వెళ్లడం జరిగింది….అలాగే ఇంకో నిందితుడైన మహేష్ ,తన యొక్క ఇంకో సోదరుడు మరియు ఇతర వ్యక్తులతో కలిసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన షాప్ నిమిత్తం కేస్ పనిలో భాగంగా లాయర్ ని కలవాలని హైద్రాబాద్ కి వెళ్లడం జరిగింది….అందులో భాగంగా వరంగల్ వెళ్లి అదే రోజు రాత్రి జమ్మికుంట తిరిగి వచ్చిన భాస్కర్ తమ కుటుంబ సభ్యులను తన కొత్త ఇంటి వద్ద దింపి,అతను ఒక్కడే షాప్ ఉన్న ఇంటి దగ్గరకి వచ్చి వేసిన తాళం తీసి,తను ముందు గానే పగలగొట్టి పెట్టుకున్న తాళాన్ని ఇంటికి తగిలించి,తాళం పగలగొట్టి చోరీ జరిగినట్లు గా చూపిస్తూ, నమ్మించి చుట్టు పక్కల షాప్ వాళ్ళకి,వారి యొక్క సంఘం వాళ్ళకి అందరికి తెలిపి భారీగా దొంగతనం జరిగినట్లు చిత్రీకరించాడు…అలాగే ఇంకో నిందితుడైన మహేష్ కూడా హైద్రాబాద్ నుండి వస్తుండగా అతనికి ఫోన్ ద్వారా తెలిపినట్లు నటించారు…మహేష్ కూడా తిరిగి వచ్చాక ఎం తెలియనట్లు నటిస్తూ ఇద్దరు నిందితులు వారు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం హైడ్రామా చేశారు….

*బెడిసికొట్టిన నిందితుల మాస్టర్ ప్లాన్..చేదనలో ఫలించిన పోలీసుల పక్కా వ్యూహం …*

ఇట్టి నేరాన్ని ఎలాగైనా ఛేదించాలని,ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ముందుగా నేర స్థలాన్ని సందర్శించి నేరం జరిగిన తీరు,అక్కడ వస్తువులు పడివున్న పద్దతి,నేరానికి ఉపయోగించిన పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు…బృందాలుగా ఏర్పడి అనుమానితులను విచారిస్తూ,సీసీ కెమెరాలను పరిశీలిస్తూ,ఇంట్లో మరియు అక్కడికి వచ్చి వెళ్లిన వారి,పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి దర్యాప్తును వేగవంతం చేయగా,పోలీసులు ఉపయోగించిన *ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,సిసి కెమెరాల* ద్వారా ఇంటి వ్యక్తుల పైనే అనుమానం ఉన్నట్టు గా ఆధారాలు లభించగా కాసుల మహేష్ మరియు భాస్కర్ లను విడి విడిగా విచారించగా వారే దూరాశతో ఇట్టి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించామని,తద్వారా బ్యాంక్ లలో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టాలను నిర్ణయించుకున్నామని ఒప్పుకోవడం జరిగింది….

*నిందితుల స్వాధీనం నుండి రికవరీ చేసిన సొత్తు వివరాలు (ఇంటాక్ట్)…*

1)700 గ్రాముల బంగారం…
2)6కిలోల వెండి…

*మొత్తం విలువ…11,70,000/-…*

*నిందితుల యొక్క వివరాలు….*

*1*.కాసుల మహేష్ s/o సదానందం,35సం, అవుసల r/o జమ్మికుంట (పిర్యాది)….
*2*.కాసుల భాస్కర్s/o సదానందం,34సం, అవుసల r/o జమ్మికుంట….

*నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన పోలీసుల వివరాలు…*

*జి.చంద్రమోహన్,అడిషనల్ డిసిపి (అడ్మిన్),ఎస్.శ్రీనివాసరావు,ఏసీపీ హుజురాబాద్ ఆధ్వర్యంలో….*

*హుజురాబాద్ టీం…*

1.కె.సృజన్ రెడ్డి,ఇన్స్పెక్టర్,జమ్మికుంట టౌన్…
2.ఇ. కిరణ్,సిఐ,హుజురాబాద్ రూరల్…
3.టి. సత్యనారాయణ,ఎస్సై,జమ్మికుంట…
4.ఎం.ప్రవీణ్ రాజ్,ఎస్సై,జమ్మికుంట…
5.కె.కిరణ్ రెడ్డి,ఎస్సై,వీణవంక…

మరియు సిబ్బంది…

*సీసీఎస్ టీం…*

1.కె.శ్రీనివాస్ ,ఏసీపీ,సీసీఎస్.. 2.కె.రామచందర్ రావు,ఇన్స్పెక్టర్,సీసీఎస్..
3.జి.ప్రసాద్,ఎస్సై,సీసీఎస్…
4.జి.అశోక్ రెడ్డి,ఎస్సై,సీసీఎస్…
మరియు సీసీఎస్ సిబ్బంది….

*టెక్నికల్ టీం…*

1.టి. మురళి,ఆర్ఎస్సై,ఇంచార్జ్,సైబర్ ల్యాబ్ & సిబ్బంది….

*క్లూస్ టీం…*

1.ఎం.శ్రీధర్,ఎస్సై,ఇంచార్జ్ ,క్లూస్ టీం & సిబ్బంది…

ఇట్టి కేసును ఛేదించడంలో చాక చక్యంగా వ్యవహరించిన పై పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అభినందించి,తగు రివార్డులు అందజేయడం జరిగింది…

*శ్రీ వి.బి.కమలాసన్ రెడ్డి,ఐపీఎస్*
*పోలీస్ కమిషనర్,*
*కరీంనగర్…*

About The Author