ఖర్జూర పండు ఉపయోగాలు తెలిస్తే…
ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం. శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి.
ఖర్జూర పండును మెత్తగా నూరి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.
గుండె ఆరోగ్యానికి గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి, ఇందులోని పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. రక్తపోటును నివారించే సామర్థ్యం కూడా దీనికి ఉంటుది. మత్తుపదార్ధాల ప్రభావం నుండి బయట పడాలంటే ఖర్జూరాలు మంచి ఔషధం. గింజ తీసివేసి ఈ రసం ప్రతిరోజూ రెండు పూటలా తాగితే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది
మరిన్ని కొత్త విషయాలకూ… krupaayurvedic.blogspot. com లో చూడండి