బీజేపీలోకి మోహన్‌బాబు…? ఏపీలో ఏం జరుగుతోంది..?


టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన మోహన్ బాబు… వైసీపీని వీడి… త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది..

తాజాగా మోహన్ బాబు… కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు అరగంటపాటూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా… నరేంద్ర మోదీ… మోహన్‌బాబు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించారు. దీనిపై వెంటనే సరే అని చెప్పకపోయినా… మోహన్‌బాబు నవ్వుతూ మోదీ ప్రతిపాదనను స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా… మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ… ఓ ట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్‌ను కలిశానని ట్వీట్‌లో కామెంట్ పెట్టారు..

దీన్ని బట్టీ…మంచు ఫ్యామిలీ మొత్తం బీజేపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హీట్‌గా మారాయి. కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటడం, రాజధానిని అమరావతి నుంచీ వైజాగ్‌కి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండటం వల్ల కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి..

ఈ తరుణంలో… బీజేపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ… ధర్నాలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారు… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి సమయంలో… తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ…

మంచు వారి ఫ్యామిలీని ఆహ్వానించడం ద్వారా… అటు ఏపీ, ఇటు తెలంగాణలో రాజకీయాల్ని ప్రభావితం చెయ్యాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.అన్నీ సెట్ అయితే… అతి త్వరలో వైసీపీని వీడి… మోహన్ బాబు బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

మోహన్ బాబు…జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. జగన్ స్వయంగా ఆయన్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల నామినేషన్ ముగిసిన తర్వాత మోహన్ బాబు… వైసీపీలో జాయిన్ కావడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీలో మోహన్ బాబుకు…జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఐతే… మోహన్ బాబు ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీలో బేషరుతుగా చేరానని తెలిపారు. ఇప్పుడాయన బీజేపీ వైపు చూస్తుండటంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

About The Author