దర్బార్‌ మూవీకి హైకోర్టు షాక్…


సంక్రాంతి వస్తుందంటే చాలు పెద్ద సినిమాలు.. అగ్ర హీరోలు నటించిన మూవీలు క్యూ కడుతుంటాయి. ఈ సంక్రాంతి సీజన్‌ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ నటించిన దర్బార్‌ చిత్రంతో షురూ రానుంది.ఈరోజు (గురువారం జనవరి 9) విడుదల కావాల్సి ఉంది. ఇలాంటివేళ మద్రాస్‌ హై కోర్టు వెలువరించిన తాజా ఆదేశాలు ఈ సినిమాకు గట్టి షాక్‌ ఇచ్చాయని చెప్పక తప్పదు. దర్బార్‌ విడుదలను నిలిపి వేయాలంటూ మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ లో శుభకరణ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ కు ఉండే స్టార్‌ స్టేటస్‌ కు తగ్గట్లు ప్రపంచ వ్యాప్తంగా 8వేల థియేటర్ల లో భారీగా విడుదల చేస్తున్నారు. తమిళనాడుతో పాటు.. ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక తో పాటు.. పలు దేశాల్లోనూ ఈ సినిమా గురువారం విడుదల కావాల్సి ఉంది. ఇలాంటివేళ.. మలేషియా లో విడుదలకు తాజాగా అడ్డంకులు నెలకొన్నాయి. మలేషియాలో తమిళులు అధికమన్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ దేశంలోనూ దర్బార్‌ విడుదలను భారీగా ప్లాన్‌ చేశారు. అయితే.. దర్బార్‌ నునిర్మించిన లైకా సంస్థ అంతకు ముందు రజనీతో రోబో 2.0 చిత్రాన్ని చేయటం.. దానికి సంబంధించిన మలేషియా సంస్థకు రూ.23 కోట్లు బకాయిలు ఉన్న వైనం తెర మీదకువచ్చింది. పాత బకాయిల్ని చెల్లించిన తర్వాత మాత్రమే.. దర్బార్‌ చిత్రాన్ని విడుదల చేయాలంటూ సదరు సంస్థ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాల్ని జారీ చేసింది. పిటిషన్‌ దారు పేర్కొన్నట్లుగా పాత బకాయిల్ని చెల్లించటమేకాదు.. తాజా చిత్ర విడుదల కోసం రూ.4.90 కోట్లు డిపాజిట్‌ చేయాలంటూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఒకవేళ.. అలా చేయని పక్షంలో దర్బార్‌ విడుదలకు అనుమతించమని స్పష్టం చేసింది. దీంతో.. మలేషియా లో దర్బార్‌ చిత్ర విడుదల అంశం ఇప్పుడు సందేహం గా మారింది. దీంతో.. రజనీ అభిమానులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. తమ అభిమాన కథా నాయకుడి చిత్ర విడుదలన గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేయాలనుకున్నఫ్యాన్స్‌ ఉత్సాహం మీద కోర్టు ఉత్తర్వులు నీళ్లు చల్లినట్లు గా భావిస్తున్నారు. అయితే.. ముందు అనుకున్నట్లు గా గ్రాండ్‌ గా విడుదల చేసేందుకు లైకా సంస్థ యుద్ధ ప్రాతి పదికన చర్యల్ని చేపడుతోందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా..మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు రజనీ ఫ్యాన్స్‌ కు కొత్త టెన్షన్‌ గా మారాయనటంలో సందేహం లేదు

About The Author