సరిలేరు నీకెవ్వరు…


సరిపోదు ..ఈ మోతాదు..మహేష్ బాబూ..
నాకు బేసికల్ గా అనిల్ రావిపూడి కామిక్ సెన్స్ అంటే చాలా ఇష్టం.. సినిమా స్లో అవుతుందంటే దాన్ని ఎలా లేపాలో రావిపూడి అనిల్ కు కామెడీతో పెట్టిన విద్య..
..ఒక ఔట్ డేటెడ్ కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్…మహేష్ బాబు లేకపోతే టోటల్ గా ఓ రొట్టకొట్టుడు సినిమా..మహేష్ నటనకు అభినయానికి టేక్ ఏ బౌ….పదమూడేళ్ల తర్వాత విజయశాంతి కి గ్రాండ్ సెకండ్ ఇన్నింగ్స్..నాకు పర్సనల్ గా సినిమాలో ఆకట్టుకున్న అంశాలు..భారతి..అజయ్ కృష్ణ ల మధ్య అల్లుకున్న భావోద్వేగాలు మాత్రమే…బాంబ్ ను డిఫ్యూజ్ చేసే టైమ్ లో కూడా హీరో టీ తాగుదాం అంటుంటే అసలు ఇదే కదా అసలు కామెడీ..సో..మొత్తానికి సేఫ్ జోన్ లో కామెడీని నమ్ముకుని ఒక సూపర్ స్టార్ తో సినిమా తీసేయాలనుకోవడం.. దారుణం..కానీ సరేనేమౌ…
జనాలు కామెడీ కోరుకుంటుంటే మనమేం చేయగలం..ఇక్కడ అదే చేసాడు దర్శకుడు.. ఫక్తు ఫార్ములా సినిమా..హీరో గత రెండు చిత్రాలు..దర్శకుడి నాలుగు చిత్రాలతో పోలిస్తే ఇది మరీ నాసిరకం..ఇకపోతే అందరూ అనుకుంటున్న ట్రైన్ ఎపిసోడ్.. బాగా రోత.. కితకితలు పెట్టి నవ్వుకోవాలి తప్ప..ఎక్కడా మనం ఆ సీన్లతో మమేకమవ్వo..నాకర్థం కాని విషయం ఏమిటంటే ట్రైన్ సీన్ తర్వాత దాదాపు ముప్పావుగంట హీరోయిన్ కనబడదు..ఇదెవ్వరూ పట్టించుకోరు…ఒక్కడు సినిమా విలన్ ని బాగా జోకర్ చేశారు..మొత్తానికి మహేష్ కోసం ఓసారి చూస్తారేమో కానీ రిపీటెడ్ గా అయితే అంత సీన్ లేదు..దేవిశ్రీ సంగీతం పర్వాలేదు..రత్నవేలు ఫోటోగ్రఫీ ఈలలు అసలు..అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక కలబోత సినిమాలా మల్చాలని అనుకొన్న అనిల్ కు మాత్రం ఇది ఒక కంటితుడుపు లాంటి సినిమా మాత్రమే..చివరిగా దీని భవిష్యత్ తరవాతి రోజు సినిమాపై ఆధారపడి ఉంది.. నిజం..!
పండుగలో పాసయిపోద్ది..తప్ప…గొప్ప సినిమా అయితే కాదు…అర్ధమవుతుందా…??

About The Author