బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పింది కరోనా వైరస్ గురించేనా..!?
కరోనా వైరస్(Corona Virus).. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఇది. పాముల నుంచి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న వైద్య నిపుణులు.. దీన్ని తొలిసారిగా చైనాలో గుర్తించారు. దీని ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే 132 మంది మృత్యువాతపడ్డారు. అయితే.. వైరస్ గురించి కొత్త విషయం ప్రజల నోళ్లల్లో నానుతోంది. అదే.. కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారని.కాలజ్ఞానంలో 114వ పద్యం.. కోరంకి అనే జబ్బు గురించి ఉంది. అది భారత దేశానికి ఈశాన్య దిక్కున ఉన్న దేశంలో పుడుతుందని రాశారు. అంటే.. భారత్‌కు ఈశాన్య దిక్కున ఉన్నది చైనాయే. కోరంకి జబ్జుతోకోటి మంది దాకా మృతిచెందుతారని తెలిపారు. ఆ కోరంకి.. కరోనా అయితే కోటి మంది దాకా మృతిచెందుతారట. దీంతో ఆ పద్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పద్యం ఏంటంటే.’ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను’లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి’అన్న వీరబ్రంహ్మం గారి మాట నిజమవుతుందని ప్రచారం.