శ్రీవారి కళ్యాణం లడ్డూ గోవిందా గోవిందా…


టిటిడి లో ధర్మారెడ్డి తొందరపాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది!! హిందువులలో అభద్రతా భావం ఏర్పడింది!!
టీటీడీలో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలపై శ్రీవారి భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగస్తులలో తీవ్ర అసంతృప్తి!!
నిఘా వ్యవస్థలు టీటీడీ లో జరుగుతున్న వాస్తవాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలి!!నవీన్
1) కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఇచ్చే ఉచిత 2 పెద్ద లడ్డూ,2వడ,5చిన్న లడ్డూల కి ధర్మారెడ్డి మంగళం!!నవీన్
2) తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూని అందులో కళ్యాణం లడ్డు కి ప్రత్యేకత ఉంది
శ్రీవారి కల్యాణోత్సవం సేవలో పాల్గొన్న ప్రతి జంటకు చిన్నపాటి వస్త్రం,జాకెట్టు తో పాటు కళ్యాణం లడ్డు వడలు ఇవ్వడం అనాదిగా తిరుమల ఆలయంలో వస్తున్న సాంప్రదాయం అలాంటి సాంప్రదాయానికి ధర్మారెడ్డి మంగళం పాడటం అనాలోచిత నిర్ణయం!!
3) టీటీడీలో ధర్మారెడ్డి మూడవసారి తిరుమలకు వచ్చిన నాటి నుంచి ధార్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారని శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు!!
4)”వడ్డించే వాడు మనవాడు” అయితే ఏ బంతిలో అయినా కూర్చోవచ్చు అన్న చందంగా
తిరుమల జే ఈ ఓ గా (ఐఏఎస్ కాదు కాబట్టి) ధర్మారెడ్డి కి అర్హత లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ గా ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నెల తిరగకముందే తిరిగి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడం టీటీడీ చరిత్రలో మొదటిసారి అది కూడా చాలదన్నట్లు ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా మరో పదవిని కట్టబెట్టడం అధర్మం అన్నారు!
4) తిరుమల శ్రీవారిని ఓ పథకం ప్రకారం సామాన్య భక్తులకు దూరం చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి!!
5) తిరుమల శ్రీవారి నిధులతో గుజరాత్ ,కాశ్మీర్ లతో పాటు ఇతర రాష్ట్రాలలో అవసరం లేకపోయినా సొంత పరపతి కోసం తమ కుర్చీలను కాపాడుకోవటానికి టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కడపడితే అక్కడ దేవాలయాలు,కల్యాణ మండపాల పేరుతో కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఇచ్చే సబ్సిడీ లడ్డు భారమని ఇప్పటికే తొలగించడం, ఇప్పుడు ఏకంగా కల్యాణోత్సవంలో ఇచ్చే ఉచిత పెద్ద లడ్డు,వడ లను అదనపు దర చెల్లిస్తే ఇస్తాం అని చెప్పడం దుర్మార్గం!!
6) శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో ఒక్క టికెట్ 10 వేల రూపాయలకు అమ్ముతున్నారు ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు దేశవ్యాప్తంగా దేవాలయాలు కట్టమని ధర్మారెడ్డి ని ఎవరు అడిగారో భక్తులకు సమాధానం చెప్పాలి!!
7) మే నెల నుంచి కొత్త విధానం అమలు చేస్తామని “లీకు”లు ఇస్తున్న ధర్మారెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై ధర్మకర్తల మండలి చైర్మన్,సభ్యులు ఉత్సవ విగ్రహాలలా ఎందుకు మౌనంగా ఉన్నారు!
8) తిరుమల శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నవారికి ఇచ్చే ప్రసాదాలకు టీటీడీ మంగళం పాడితే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పెద్ద లడ్డూలు ఇకపై అదనంగా డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందేనని దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనీ ధర్మారెడ్డి తీరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని నవీన్ అన్నారు!!
9)ధర్మారెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న సమాచారాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం నివేదికను తెప్పించుకొని పునః పరిశీలించాలన్నారు!!
10) ఆర్జిత సేవల్లో పాల్గొనేవారికి వెంకన్న దర్శనం సంతృప్తిగానే ఉన్నప్పటికీ అరుదైన కల్యాణోత్సవం లడ్డూలు, వడలు,జిలేబీలను శ్రీవారి భక్తులకు దూరం చేస్తున్నారంటూ నవీన్ మండిపడ్డారు!!
11)ఆర్జితసేవల టికెట్‌ ధరను సేవ విశిష్టతను బట్టి ప్రసాదాలు ఉచితంగా ఇచ్చేవారు వారాంతపు సేవల్లో విశేషపూజకు ఒక పెద్ద లడ్డూ, వడ, అష్టదళపాదపద్మారాధనకు 2 పెద్దలడ్డూలు,2వడలు,సహస్ర కలశాభిషేకానికి పెద్దలడ్డూ, వడ,2 అప్పాలు, తిరుప్పావడకు పెద్దలడ్డూ, వడ, జిలేబీ, మురుక, వస్త్రం, అభిషేక సేవకు 2 పెద్దలడ్డూలు,2వడలు, నిజపాదసేవకు 2లడ్డూలు ఇచ్చేవారు అందులో నష్టం వస్తుంది అని చిలక పలుకులు పలికే ధర్మారెడ్డి కి ఇటీవల టాటా క్యాన్సర్ హాస్పటల్ కోసం 15 కోట్ల లబ్ది చేకూర్చడంలో నష్టం కనపడలేదా అని నవీన్ ప్రశ్నించారు!!
12) నిత్యసేవలైన సుప్రభాతం, తోమాల,అర్చన,ఊంజల్‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, దీపాలంకార సేవలకు 2 లడ్డూలు, కల్యాణోత్సవానికి 2 పెద్దలడ్డూలు, 2 వడలు, 5 చిన్న లడ్డూలు ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం వాటన్నింటినీ తొలగించి ఒక్కొక్కరికి ఒక ఉచిత లడ్డూ మాత్రమే ఇవ్వడం సమంజసం కాదన్నారు.
13) ఏప్రిల్‌ వరకు ముందస్తుగా బుక్‌ చేసుకున్నవారికి మాత్రం గతంలో ఇచ్చిన తరహాలోనే ప్రసాదాలు అందజేస్తున్నప్పటికీ కరెంట్‌ బుకింగ్‌,మే నుంచి ఆన్‌లైన్‌లో సేవలు పొందేవారికి చిన్న లడ్డూ ఉచితంగా ఇస్తూ మిగిలిన ప్రసాదాలన్నిటికీ మంగళం పాడారు.
14) ధర్మారెడ్డి కి నిజంగా శ్రీవారి నిధులు కాపాడాలి అనే చిత్తశుద్ధి ఉంటే టిటిడి లోని ఐఏఎస్ అధికారుల దుబారా ఖర్చులు తగ్గించాలి, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి దేవాదాయశాఖ ఆలయాలను టీటీడీ లో విలీనం చేయడానికి స్వస్తి పలకాలి!!రాజకీయ నాయకుల సిఫార్సులతో కోట్లాది రూపాయల శ్రీవారి నిధులతో కల్యాణమండపాలు నిర్మించడం నిలిపివేయాలే తప్ప శ్రీవారి లడ్డూలలో లాభనష్టాలు చూడడం మహా అపచారం అని నవీన్ అన్నారు.
గోవిందా గోవిందా గోవింద

About The Author