తెలంగాణకు కేంద్రం నిధుల వివరాలు…


తెలంగాణ కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల వివరాలను అందులో పేర్కొన్నారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్నదన్న నిర్మల సీతారామన్.. ఆ తర్వాత క్రమంగా అప్పులు పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు
(గత ఆరేళ్లలో..)
పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు
రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు
స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.1,916 కోట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు
కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298.84 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు

About The Author