తిరుపతిలో “కరోనా” అనుమానం…
తిరుపతిలో కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానం వ్యక్తం అవడంతో ఓ వ్యక్తిని ప్రత్యేక వార్డు కి తరలించారు. చిత్తూరులోని అమరరాజ కంపెనీలో పని నిమిత్తం ఓ టెక్నీషియన్ తైవాన్ నుండి ఇండియా వచ్చాడు. వచ్చిన చైనా దేశస్థుడికి కరోనా సోకినట్టు కంపెనీ ప్రతినిధులకు అనుమానం కలిగింది. దీంతో అతడిని తిరుపతి రుయాకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో రక్త నమూనాలను పూణే, హైదరాబాదు లకు పంపించారు వైద్యులు. అక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తే కానీ ఇతనికి వైరస్ సోకింద లేదా తెలుస్తుంది. ఇక ఆ వ్యక్తిని మాత్రం ప్రత్యేక వార్డు లో పెట్టి వైద్య పరీక్షలు చేస్తున్నారు.