చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో 6 నెలల పసికందు ఆదృష్యం…


గుర్తు తెలియని మహిళ బాలుడిని ఏతుకెళ్ళినట్లు అనుమానిస్తున్న పోలిసులు.
తాడి పత్రి కి చెందిన స్వర్ణలత కు . అదే పట్టణానికి చెందిన శివుడు అనే వ్యక్తితో 5 సంవచ్చరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు పెద్ద బాబు అనే మగ పిల్లవాడు వున్నాడు.గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి తాడిపత్రి నుంచి రేణిగుంట లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు పది రోజుల క్రితం చేరుకుంది. కానీ ఇక్కడకూడా తల్లి దండ్రులతో విభేదాలు రావడంతో స్టేషన్లో చంటి బిడ్డతో ఒంటరిగా వారం రోజులు ఫ్లాట్ ఫారం లోనే గడిపింది. ఇదంతా గమనించిన గుర్తు తెలియని మహిళ ఆమెను పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి , నిన్ను మంచి ఉద్యోగం లో చేర్పిస్తాను ,నీకు నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఏర్పరుస్తను అని మాయ మాటలు చెప్పి భోజనం పెట్టించి, కొత్త బట్టలు కొనిచ్చి , దుస్తులు మార్చుకొని రమ్మని చెప్పి చంటి బిడ్డను ఎత్తు కెళ్ళిందని బాధితురాలు రైల్వే పోలీసులకు పిర్యాదు చేసింది. కానీ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకోక పొగ ఆమెను రెండు రోజులు తిప్పించు కొని రేణిగుంట అర్బన్ పోలీసులను కలవమని సలహా ఇచ్చారని , వెంటనే అర్బన్ పోలీసులను సంప్రదిస్తే వారు ఎస్పి రమేష్ రెడీ ఆదేశాలతో వెంటనే జీరో FIR నమోదు చేసి రైల్వే స్టేషన్ లోని సీసి కెమెరాలను పరిసెలించటంతో గుర్తు తెలియని మహిళ బాబుని ఎత్తు కెళ్ళినట్లు గుర్తించారు. అనంతరం రెండు పోలిసు బృందాలను ఏర్పాటు చేసి తమిళనాడు కు ఒక బృందం , విజయవాడకి ఒకబ్రుందన్ని పంపించి , రేణిగుంట పరిసరాలలోని సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.

About The Author