బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తున్నారా…? వద్దు ఇలా ఉపయోగపడ్తాయ్…


అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటికి మూడుసార్లు కడిగి ఆ నీళ్లను పారబోస్తుంటాం. కానీ వాటిలో ఔషధ విలువలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఫైబర్ వుండటంతో ఇవి చర్మ మరియు కేశ సంబంధ సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తాయంటున్నారు.

మొటిమలు…
టీనేజ్ వయసు వారికి మొటిమల సమస్య సాధారణంగా వుంటుంది. ముఖంపై ఇవి చూసేందుకు ఇబ్బందికరంగా వుండటంతో పాటు ఇరిటేషన్ కలిగిస్తుంటాయి. అలా ఇబ్బందిపడేవారు బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తే చాలు. ఇందుకుగాను కొద్దిగా కాటన్ తీసుకుని బియ్యం కడిగిన నీళ్లలో ముంచి మొటిమలు వున్నచోట రాసి ఆ తడి పూర్తిగా ఆరిపోయేవరకూ అలాగే వుంచాలి. ఆ తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మొటిమలు మాయమవుతాయి.

చర్మంపై ముడతలు…
కొందరు వయసు తక్కువయినా చర్మంపై ముడతలు రావడంతో వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. ఇలాంటివారు బియ్యం కడిగిన నీళ్లను ముడతలు వున్న చర్మంపై మర్దన చేస్తుంటే చర్మంపై వున్న ముడతలు పోయి నిగారింపు వస్తుంది.

About The Author