రాహుల్ కోసం రంగంలో కి దిగిన నటుడు ప్రకాష్ రాజ్…
ఈ దాడిలో రాహుల్ తలపై ఎమ్మెల్యే సోదరుడు బీరు బాటిల్ పగలగొట్టాడు. దాంతో అతడి తలకు గాయం కాగా అతన్ని వెంటనే పబ్ నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుండి బయటికి వచ్చిన అనంతరం రాహుల్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మీడియా ముందు అన్నాడు. కాగా ఈ విషయంపై రాహుల్ కేటీఆర్‌కు సైతం ట్వీట్ చేసి నేను టీఆర్ఎస్ అభిమానినే నాకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. కాగా రాహుల్ పై జరిగిన దాడిని ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు వ్యతిరేఖిస్తూ ట్వీట్ చేశారు. రాహులకు న్యాయం జరగాలని సింగర్ నోయల్, వరుణ్ సందేశ్ పోస్టు పెట్టారు. కాగా ఈ దాడిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ రాహుల్ కు అన్యాయం జరిగిందని అన్నారు. పట్లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. వినయ్ భాస్కరను కలవడంలో ఈ కేసుకు సంభందం లేదని స్పష్టం చేశాడు. కేసు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్‌ను కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాహుల్ తప్పు చేయనప్పుడు కాంప్రమైజ్ కావాల్సిన అవసరమేంటన్నారు.