ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని ఆశ్రయించిన వరంగల్ యువతి
లైంగికంగా వేధించడంతో పాటు వ్యభిచార కూపంలోకి దిగేలా ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న యువతి..!డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడని వరంగల్‌కు చెందిన యువతి ఆరోపించింది. రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఫిర్యాదు చేసింది. లారెన్స్ సోదరుడు వినోద్ ప్రేమను నిరాకరించినందుకు… లైంగికంగా వేధించడంతో పాటు వ్యభిచార కూపంలోకి దించాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వినోద్ చేస్తున్న చీకటి వ్యాపారాలు తనకు తెలుసని అందుకే చంపాలను కుంటున్నాడని తెలిపింది. కులం పేరుతోనూ దూషించాడని పేర్కొంది. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా… అక్కడి సీఐ వాళ్లతో కుమ్మక్కై తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది. జైలుకు పంపించారని బాధితురాలు పేర్కొంది. లారెన్స్ సోదరుడి నుంచి ప్రాణ హాని ఉందని…తనను కాపాడాలని కోరింది.