స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం…


రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్‌ ఉద్దేశపూర్వక చర్యలపై అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయం
ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆదేశాలివ్వాలంటూ రేపు పిటిషన్‌ దాఖలు చేయబోతోన్న ప్రభుత్వం
రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్‌ నిర్ణయంవల్ల రాష్ట్రానికి నష్టం చేకూరుతుందంటున్న ప్రభుత్వం
స్థానిక సంస్థలకు రూ.5 వేల కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం… రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష, ఒంటెద్దు, ఉద్దేశపూర్వక చర్యలను సవాలు చేయాలని నిర్ణయం
కరోనా వైరస్‌ ప్రభావంపై హెల్త్‌ సెక్రటరీతోగాని, చీఫ్‌ సెక్రటరీతో గాని సమీక్ష, సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవడంపై సుప్రీంకోర్టుకు నివేదించాలని నిర్ణయం
కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తుందంటూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని సవాలు చేయాలని నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరుకే షెడ్యూల్‌ ప్రకారం ముగిస్తే.. పాలన మరింత బలపడుతుందన్న అంశాన్ని చెప్పాలని నిర్ణయం
కరోనా లాంటి వ్యాధులను నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని, ఆ సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల ద్వారా మరింత సమర్థవంతంగా కార్యక్రమాలు చేపట్టవచ్చునని నివేదించనున్న ప్రభుత్వం

About The Author