సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుధీర్ పెళ్లి ఫోటోలు..


సుధీర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఎందుకంటే తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. పైగా ఆయన పెళ్లికి కూడా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
సుధీర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఎందుకంటే తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. పైగా ఆయన పెళ్లికి కూడా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రష్మి గౌతమ్‌‌తో ఆయన పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు కూడా వచ్చాయి. దాంతో సుధీర్ పెళ్లి ఫోటోలు అంటే అదే అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ సుధీర్ అంటే సుడిగాలి కాదు.. కొరియోగ్రఫర్ సుధీర్. పెళ్లైన ఏడాదికి ఈయన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బుల్లితెర నటి అస్మితను ఈయన పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జులై 7న వీళ్ల పెళ్లి జరిగింది. అది కూడా రాజస్థానీ స్టైల్‌లో. అప్పట్లో చాలా ఘనంగా వీళ్ల పెళ్లి జరిగింది.

మరి ఇప్పుడెందుకు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయ్ అనుకోవచ్చు.. దానికి కూడా కారణం ఉంది. ఈ మధ్యే ఈ ఇద్దరూ ఓంకార్ స్టార్ మా జోడీ కార్యక్రమానికి వచ్చారు. అక్కడ తమ జీవితంలో ఉన్న చాలా విషయాల గురించి చెప్పుకొచ్చారు. తెలుగులో పలు సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది అస్మిత. ఈమె సుధీర్‌ని పెళ్లి చేసుకుంది అనగానే జబర్దస్త్ సుధీర్ అనుకున్నారు చాలా మంది. ఆ తర్వాత తెలిసింది అస్మిత ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధీర్ వేరు.. నటుడు సుధీర్ వేరు అని. స్టార్ మా జోడీలో తమ పెళ్లి ఫోటోలు ఎక్స్‌క్లూజివ్‌గా చూపించారు ఈ జోడీ. దాంతో పాటే తమ జీవితంలోకి కొన్ని కీలకమైన సంఘటనల గురించి కూడా చెప్పారు.

About The Author