టీడీపీ కి పరిటాల ఫామిలీ గుడ్‌బాయ్ …? క్లారిటీ ఇచ్చిన శ్రీరామ్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. కొన్నేళ్లుగా పార్టీలో ఉన్న పలువురు సీనియర్లు నేతలు సైతం టీడీపీని వీడి అధికార వైసీపీలోకి వెళ్తున్నారు. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కీలకమైన పరిటాల ఫ్యామిలీ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విభేదాల వలన టీడీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో పరిటాల కుటుంబం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిపై పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ స్పందించారు. టీడీపీని వీడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
“తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజా అభివృద్ధి కాంక్షిస్తూ నిత్యం ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద, కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు.. అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసే సంస్కృతి మాకు లేదన్నారు. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం. కార్యకర్తలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి. మేము పార్టీ మారుతున్నట్లు జరగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు” అని శ్రీరామ్ ఓ ప్రకటనను ఇచ్చారు
Official statement… @TV9Telugu @TV9Telangana @Abnandhrajyothi @tv5newsnow @ncbn @naralokesh @RamMNK @JaiTDP @BangaloreTDP @atpdist_tdp @krishna_tdp @AnuradhaTdp @kesineni_nani @DevineniUma pic.twitter.com/FXBWgLuLFe
— Paritala Sreeram (@IParitalaSriram) March 15, 2020