రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉద్యోగుల కు కరోనా సోకిందని అంటూ కలకలం..


ఈ నెల పదమూడో తారీకున న్యూ డిల్లీ నుండి తిరుపతి సంపర్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు లో “టీ.టీ.”లు గా S9 AC బోగీలో విధులు నిర్వహించిన సత్యనారాయణ, అశోక్. వీరితో పాటు 70 మంది అదే బోగీలో ప్రయా నించిన వారిలో కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో పాటు ట్రైన్ లాస్ట్ స్తాపింగ్ రేణిగుంట కావడంతో అప్పుడు విధులలో ఉన్న టిటి లకు కూడా కరోనా సోకే అవకాశం ఉంటుందనే అనుమానంతో రైల్వే అధికారులు రేణిగుంట లోని గురువారం రైల్వే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన రైల్వే డాక్టర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాల మేరకు ఇరువురికి పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం వీరికి ఎటువంటి కరోనా లక్షణాలు ఏమి లేవు కానీ, కొద్ది రోజులు మా పర్యవేక్షణలో ఉంచుకొని తరువాత డిష్ఛార్జ్ చేస్తామని తెలిపారు. రేణిగుంట ప్రజలు ఎటువంటి కరోనా వైరస్ అంటూ బయందొలన చెందవలసిన అవసరం లేదు అని సూచించారు.

About The Author