ఆంధ్రప్రదేశ్ RTA ఆఫీస్ లు బంద్…


కోవిడ్19 ప్రభావంతో ఈ నెల 21వ తారీకు నుండి ఏప్రిల్ 5 వరకు ఎల్ఎల్ఆర్ పరీక్షలు, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్లు నిలుపుదలచేసాం- డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు

కోవిడ్ 19 కరోనా వైరస్ కరచాలనం ద్వారా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయాల్లో బయోమెట్రిక్ ద్వారా పొందే సేవలు ఎల్ఎల్ఆర్ పరీక్షలు, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ లు, 3 టైర్ ఆఫ్ లైన్ విధానంలోని వాహన లావాదేవీలను ఈ నెల 21వ తారీకు నుండి ఏప్రిల్ 5వ తారీకు వరకు నిలుపుదల చేయడం జరిగిందని డిటీసి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.

స్థానిక డీటీసీ కార్యాలయంలో గురువారం నాడు డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు నిమిత్తం రాష్ట్ర రవాణాశాఖ గురువారం నాడు ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఉత్తర్వుల పేర్కొన్న విషయాలను పేర్కొంటూ ఈ నెల 21వ తారీకు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఎల్ఎల్ఆర్ పరీక్షలు కొత్త డ్రైవింగ్ లైసెస్సుల మంజూరిని నిలుపుదల చేయడం జరిగిందని సేవలు పునరుద్ధరణ కోసం ఏప్రిల్ 1వ తారీకు నుండి ప్రతి అభ్యర్థికి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. త్రీటైర్ ఆఫ్ లైన్ విధానంలో జరిగే వాహనాల లావాదేవీలు ఈనెల 30వ తారీకు వరకు గడువు అనుమతించినప్పటికీ కార్యాలయాలకు ఎక్కువమంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున త్రీటైర్ విధానంలోని వాహన రిజిస్ట్రేషన్ సంబంధించిన లావాదేవీలను కూడా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ఎక్కువమంది సందర్శకులను కార్యాలయాలకు రప్పించుకోకుండా చూడాలన్నారు. కార్యాలయాల్లోని అధికారులు ఉద్యోగులు పనిచేసే స్థానంలో ఉపయోగించే వస్తువులన్నింటిని పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేజేషన్ చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులను తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఊపిరితిత్తులు, జ్వరం లేదా జ్వరం వచ్చేటివంటి లక్షణాలు ఉన్నట్లు అనిపించిన కూడా ఉన్నత అధికారులకు తెలియజేసి కార్యాలయం నుండి వెళ్లిపోవాలన్నారు. వైద్యం నిమిత్తం వైద్యుని సంప్రదించాలన్నారు. ఆరోగ్య పరమైన సమస్యలతో ఏ ఉద్యోగి అయినా సెలవు కోరిన ఎడల ముందోస్తు జాగ్రత్త చర్యలో భాగంగా సెలవులను మంజూరు చేయాలని అధికారులకు తెలియజేశామన్నారు.

About The Author