తక్షణమే అమల్లోకి అంటు వ్యాధుల నివారణ చట్టం..!
*ఏడాది పాటు అమలు*
*జిల్లా ఉన్నతాధికారులకు చర్యలు తీసుకునే అవకాశం*
*చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం శిక్షించే అవకాశం*
? రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్ను నివారించ డానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
? వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా… రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. ఏడాది పాటు అంటువ్యాధుల నివారణ చట్టం అమల్లో ఉండనుంది.
? కరోనా నివారణ చర్యలు తీసుకునే అధికారాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు.
? *అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం*.. ఏదైనా గ్రామంలో, పట్టణంలో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని భావిస్తే… పురపాలక కమిషనర్లు గాని, కలెక్టర్లు గాని నిర్ణయం తీసుకునే అధికారం ఉంది.
? సదరు పట్టణానికి రాకపోకలు నిషేధించే అధికారం ఉంటుంది.
? అవసరమైన పరిస్థితుల్లో సినిమాహాళ్లు, షాపింగ్ మాల్లు, పాఠశాలలు, ఫంక్షన్ హాల్లు మూసివేయించవచ్చు.
? ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించు కోవచ్చు.
? అంటువ్యాధుల నివారణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తిని గాని, సంస్థను గాని చట్టప్రకారం శిక్షించే అధికారం సంబంధిత శాఖకు ఉంటుంది.
మురళీధర్
*పోలీస్ నిఘా స్టాఫర్*