తెలంగాణలో క్వారంటైన్‌ స్టాంపింగ్‌…


హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్ చేస్తూ ప్రభుత్వ సిబ్బంది ముద్రలు వేయడం ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో చేతి వేలిపై సిరా చుక్క వేసేందుకు ఉపయోగించే ఇంకుతో రూపొందించిన స్టాంప్‌ను చేతి మడమపై కనిపించే విధంగా  వేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన తేదీ నుంచి 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని, అన్ని రోజులను లెక్కించి స్టాంపులో తేదీని సరిచేసి వేస్తున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 13 వేల మంది వరకు విదేశాల నుంచి వచ్చారని సమాచారం. వారందరి పాస్‌పోర్ట్‌ అడ్రస్‌లతో ఇళ్లకు వెళ్లి ముద్రలు వేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

About The Author