ప్రజలకు విజ్ఞప్తి, మహేందర్ రెడ్డి
* కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి
* ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
* జి. ఓ. 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశాము.
* ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి.
* వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి.
* సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్ల పైకి రావద్దు.
* ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి.
* తెలంగాణ సమాజంకోసం పోలీసులు ఆంక్షల అమలులో ఖచ్చితంగా వ్యవహరిస్తారు.
* అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
* పగటిపూట అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువుల విక్రయాలు అన్ని రాత్రి 7 గంటలకు మూసివేయించబడతాయి.
* ఒక కాలనీలో వెహికిల్ పై ఒకటి, రెండు కిలో మీటర్లకు మించి ప్రయాణం అనుమతించబడదు.
* ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము.
* ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు.
* సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత మాత్రమే రిలీజ్ చేస్తారు.
* ప్రైవేట్ వాహనాలను నిత్యావసర వస్తువులు/అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు.
* మీడియా/విలేకరులకు పై ఆంక్షలలో వెసులుబాటు కలదు.
* ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తారు.
* వైయోలేషన్ / అతిక్రమణకి పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది.
* ప్రతి బైక్ పై ఒక వ్యక్తి, ఫోర్ వీలర్ లో ఇద్దరికి మాత్రమే అనుమతి.
* ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము.
* చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము.
* ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయబడుతుంది.
* నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
* లాక్ డౌన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగినది, కాబట్టి ప్రజలు తప్పనిసరిగా పై సూచనలు పాటించవల్సినదిగా కోరుతూ…
మీ డీజీపీ తెలంగాణ,
శ్రీ. యం మహేందర్ రెడ్డి ఐ పి యస్.