ఈ ప్రపంచానికి ఏమైంది..? మళ్ళీ హంటా వైరస్ దాడి మొదలైంది…


ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని బాధపడుతుంటే మరో వైరస్ దాడి చేస్తోంది. చైనాలోని యున్నన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి హంటా వైరస్‌తో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. చైనాలో 1950 నుంచి 2007 మధ్య హంటా వైరస్‌తో 46,000 మంది మృత్యువాత పడ్డారు. 15 లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది. 2005-2010 మధ్య ఫిన్లాండ్‌లో 32వేల మందికి హంటా సోకింది. రష్యాలో 1996 నుంచి 2006 మధ్య 90,000 కేసులు నమోదయ్యాయి. ఇలా సోకుతుంది ———–/// హంటా వైరస్‌ ముఖ్యంగా ఎలుకలు, మూషిక జాతి జీవుల ద్వారా వ్యాప్తిస్తుంది. ఉదాహరణకు ఎలుకల మలం, మూత్రం, లాలాజలం కలిసిన గాలిని పీల్చుకుంటే ఈ వైరస్‌ సోకుంది. అయితే మనిషికి సోకిన తర్వాత మరో మనిషికి ఇది అంటుకోదు. లక్షణాలు…. ——// ముందు అలసట, జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, బద్దకం, తిమ్మిర్లు, ఉదర ఇబ్బందులు ఉంటాయి. పది రోజుల తర్వాత దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడటం. ఒకటి నుంచి రెండు వారాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎనిమిది వారాల వరకు కనిపించవు. మొదట తలనొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, జ్వరం, తిమ్మిర్లు, చూపు తగ్గడం ఉంటాయి. తర్వాత రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం కనిపిస్తుంది.

About The Author