తిండిలేక గడ్డి పై ఉప్పు చల్లుకొని తింటున్న చిన్నారులు..


వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గంలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఆరుగురు నిరుపేద చిన్నారులు.. తిండి కరువై గడ్డిపై ఉప్పు చల్లుకొని తింటున్న సంఘటన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. వారణాసి సమీపంలోని కోయిరీపూర్ గ్రామంలో బుధవారం కనిపించిందీ దృశ్యం.
ఈ చిన్నారుల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో అనేకంగా షేర్ అవుతున్నాయి. అయితే స్థానిక జిల్లా కలెక్టర్ చెబుతున్న కథనం మరో రకంగా ఉంది. ‘‘బయటి నుంచి చూసేవారికి చెట్లు తింటున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి చిన్నారులు పెసర, శెనగ చెట్ల నుంచి గింజలు తింటున్నారు. వారి కుటుంబాలకు రేషన్ కార్డు కూడా ఉంది. ఈరోజే వారికి అదనపు రేషన్ కూడా ఇచ్చాం’’ అని పేర్కొన్నారు.
‘‘ఆ గ్రామంలో ముసహర్స్ (దళిత) సామాజిక వర్గం పరిస్థితి దారుణంగా ఉందని ఓ రిపోర్టర్ నాతో చెప్పాడు. వారికి తిండి కొరత ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని అతడు నాతో అన్నాడు’’ అని బారాగోన్ స్టేషన్ ఆఫీసర్ సంజయ్ సింగ్ అన్నారు. వెంటనే వారికి ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం, వంట నేనె, బంగాళదుంపలు, ఇతర నిత్యవసర సామాగ్రిని ఇవ్వాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు సంజయ్ సింగ్ పేర్కొన్నారు.??

About The Author