బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా లక్షణాలు…
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. కోరానా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్రధాని బోరిస్ కు కరోనా సోకినట్లు తేలింది. బోరిస్..డౌనింగ్ స్ట్రీట్ లోని తన ఇంట్లో ఐసొలేట్ అవనున్నారు. కరోనా సంక్షోభాన్ని హ్యాండిల్ చేస్తున్న ప్రభుత్వ ఇన్ చార్జ్ గా బోరిస్ ఉంటారని ఓ ప్రకటనలో డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.
గడిచిన 24గంట్లలో తనలో కరోనా లక్షణాలు మెల్లగా బయటపడ్డాయని,తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రధానమంత్రి బోరిస్ జాన్స్ ఓ వీడియోలో తెలిపారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను ఇప్పుడు స్వయంగా ఐసొలేట్ అయ్యానని బోరిస్ తెలిపారు