సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత, చంద్రబాబు లేఖ….


*సమన్వయం లేకపోతే కరోనాను కట్టడి చేయలేం: సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత, చంద్రబాబు లేఖ.*

అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం ఉంటే కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయలేమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

*శుక్రవారం ఆయన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు.* 

*‘‘విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ గత 11 నెలలుగా నిర్లక్ష్యానికి గురైంది.* 

*అన్న క్యాంటీన్ల మూసివేతతో రూ.5కే భోజనం లభించే అవకాశం ప్రజలకు పోయింది.*

*తక్షణమే బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి.*

*నిత్యావసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే అందుబాటులోకి తేవాలి.*

*నిత్యావసరాల సరఫరాకు సిటీ బస్సులు, పల్లెవెలుగు సర్వీసులు ఉపయోగించుకోవాలి.*

*ఆర్టీజీఎస్‌ నిర్వీర్యం కావడంతో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధి దూరమైంది.*

*ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు మీనమేషాలు లెక్కించడం భావ్యం కాదు’’ అని పేర్కొన్నారు.*

About The Author