కరోనా కేసులతో నెల్లూరు జిల్లా లో కలవరం…
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం, వాకాడు మండలం, *చిన్నతోట PHC* పరిధిలోని *నవాబుతోట* గ్రామంలో వెలుగు చూసిన *కరోన పాజిటివ్* కేసు… ఢిల్లీ మర్కజ్ కు వెళ్ళి వచ్చిన ఆ గ్రామానికి చెందిన ముగ్గురిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ, మరో ఇద్దరి రిపోర్ట్ లు రావాల్సి ఉంది… 90 ఇళ్ళు ఉన్న ఆ గ్రామ జనాభా దాదాపు 320…
పాజిటివ్ గా నిర్ధారించిన వ్యక్తి కుటుంబాన్ని ఐసోలేషన్ కోసం నెల్లూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం… మొదట సహకరించకపోయినా ఉన్నతాధికారులు, పోలీసుల జోక్యంతో ఐసోలేషన్ కోసం నెల్లూరు వెళ్ళేందుకు ఒప్పుకొన్న పాజిటివ్ వ్యక్తి కుటుంబం…
అక్కడి ఫీల్డ్ స్టాఫ్ అనధికారిక సమాచారం ప్రకారం… *నవాబుతోట* గ్రామం నుంచి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేస్తున్న అధికారులు…
*నవాబుతోట* కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో చెన్నై చేరుకొని అక్కడి నుండి సూళ్లూరుపేట వరకు టాక్సీలో ప్రయాణించారు… అక్కడ నిలిపివుంచిన తమ బైక్ ల ద్వారా శ్రీహరికోట (SHAR) చేరుకొని(ఆ ఊరి వాళ్ళకు SHAR మార్గంలో ప్రయాణించేందుకు అధికారిక పాస్ లు కలవు…) పడవలో *నవాబుతోట* చేరుకొన్నారని… వాళ్ళ జర్నీ ట్రాక్ ను గుర్తించిన అధికారులు…
*పై సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది*