ఏపీలో ప్రారంభమైన రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1000 పంపిణీ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి పేదలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పేదలకు ఆర్థిక సహాయానికి 1300 కోట్లు విడుదల
శ్రీకాకుళం జిల్లాలో 7.5 లక్షల మందికి 75.06 కోట్లు పంపిణీ
విజయనగరం జిల్లాలో 6.47 లక్షల మందికి 64.79 కోట్లు పంపిణీ
విశాఖ జిల్లాలో 11.05 లక్షల మందికి 110.56 కోట్లు పంపిణీ
తూ.గో.జిల్లాలో 14.65 లక్షల మందికి 146.54 కోట్లు పంపిణీ
ప.గో.జిల్లాలో 11.44 లక్షల మందికి 114.48 కోట్లు పంపిణీ
కృష్ణా జిల్లాలో 11.21 లక్షల మందికి 112.10 కోట్లు పంపిణీ
గుంటూరు జిల్లాలో 12.87 లక్షల మందికి 128.70 కోట్లు పంపిణీ
ప్రకాశం జిల్లాలో 8.76 లక్షల మందికి 87.66 కోట్లు పంపిణీ
నెల్లూరు జిల్లాలో 7.76 లక్షల మందికి 77.69 కోట్లు పంపిణీ
చిత్తూరు జిల్లాలో 9.92 లక్షల మందికి 99.21 కోట్లు పంపిణీ
అనంతపురం జిల్లాలో 10.67 లక్షల మందికి 106.79 కోట్లు పంపిణీ
కర్నూలు జిల్లాలో 10.56 లక్షల మందికి 105.67 కోట్లు పంపిణీ
వైఎస్ఆర్ జిల్లాలో 7.06 లక్షల మందికి 70.69 కోట్లు పంపిణీ