సంకల్పబలం … గిరీషా సొంతం…
తిరుపతి నగరంలో కోవిద్ పనుల్లో నిరంతరం బిజీగా ఉండే ఐఏఎస్ అధికారి గిరీషా గురించి తెలుసుకుందాం… అందరికంటే ముందుగా నిద్రలేచి అందరినీ పనిలోకి పంపి వారితో పాటు బిజీగా ఉంటూ సాయంత్రం అందరి తరువాత ఇంటికి చేరుకునే ఐఏఎస్ అధికారి, తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ గిరీషాను సంకల్ప బలానికి ఓ నిదర్శనంగా చూడాలి
కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన గిరీషా అందరిలాగా చలాకీగా ఉండే ఒక సాధారణ కుటుంబీకుడు తొమ్మిదవ తరగతి చదువుతుండగా విద్యుత్ ఘాతానికి గురై తన కుడి చేతిని పూర్తిగా కోల్పోయాడు రెండు చేతులు పూర్తిగా స్పర్శను కోల్పోయిన తరుణంలో తొమ్మిది ఆపరేషన్ల తర్వాత ఎడమచేతిని కాపాడగలిగారు డాక్టర్లు. చిన్నప్పటినుంచి ఎంతగానో కలలుగన్న
డాక్టర్ కావాలన్న ఆశయాన్ని వదులు కోలేదు గిరీషా… పట్టుదలతో చదివాడు తొమ్మిదవ తరగతి పదవ తరగతి పాస్ అయ్యాడు 11వ తరగతి లో మంచి ప్రతిభను చూపాడు ఎడమ చేతితో రాయడాన్ని ప్రాక్టీస్ చేసి విజయం సాధించాడు కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో టాప్ ర్యాంకర్ గా రాష్ట్రంలో నిలిచాడు
వైద్యుడుగా తన శరీరానికి ఉన్న బలహీనతల కారణంగా రాణించ లేనని అర్థం చేసుకుని తల్లిని ఒప్పించి,