PTC భావన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో బియ్యం పంపిణి..


సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం

***పఠాన్ చేరు మండల పరిధి లోని ఇస్నాపూర్ గ్రామంలో భవననిర్మాణ కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు డిఎస్పీ రాజేశ్వర్, సీఐ నరేష్ లను ముఖ్య అతిథులుగా ఆహ్వానిచ్చి వారి చేతుల మీదుగా బియ్యం పంపిణి చేసారు….

సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలి
కరోనా నిర్మూలనకు కఠిన చర్యలు
రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్
పటాన్‌చెరు డిఎస్పి రాజేశ్వరరావు

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంక్షోభంలో పడ్డాయని, భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని పటాన్‌చెరు డిఎస్పి రాజేశ్వరరావు కోరారు. బుదవారం తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు ఆద్వర్యంలో ఇస్నాపూర్ డివిజన్ కమిటి డీఎస్పీ చేతుల మీదుగా దాదాపు వెయ్యి మంది భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా సన్న బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పి మాట్లాడుతూ కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలు తప్పవని రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడంతో పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని డీఎస్పీ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు కోరారు.
*ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు సిఐ నరేష్, పలువురు భవన నిర్మాణ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

About The Author