MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆచరణ 16 లక్షల కిలోల కూరగాయలు పంపిణీ
చిత్తూరు జిల్లా:చంద్రగిరి, కరోనా మహమ్మారి నుంచి నిరంతరంగా ప్రజలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆచరిస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. 16 లక్షల కూరగాయలు సేకరించి ప్రజలకు పంపిణీ చేయడం అనిర్వచనీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజాప్రతినిధులకు చెవిరెడ్డి ఆదర్శం అని టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రశాంతి అన్నారు. శనివారం చంద్రగిరిలో 1600 టన్నుల కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని చెవిరెడ్డి ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యులు ప్రశాంతి హాజరయ్యారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ పేద కుటుంబం ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ చెవిరెడ్డి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి ప్రజలకు పెద్ద ఎత్తున ఎలా చేస్తున్నారు అని చూసేందుకు వచ్చామని, ఇది మహా యజ్ఞం లా చేస్తుండటం ప్రజల పట్ల ఆయనకు ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది అని చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి చేస్తున్న కార్యక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళతానని వారు తెలిపారు. లాక్ డౌన్ కొనసాగించినా నా నియోజక వర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అటు రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి వారిని ఆడుకోవడం తో పాటు నియోజకవర్గ ప్రజలకు నెలంతా సరిపడా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు అందజేసినట్లు తెలిపారు. వీటి పంపిణీ బాధ్యతను వాలంటీర్లు చక్కగా చేపడుతున్నారని చెప్పారు. నా ఈ సంకల్పానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధ, తహశీల్దార్ చంద్రమోహన్, వైఎస్సార్ పార్టీ నాయకులు మస్తాన్, చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.