ఐసోలేషన్ వార్డులోని మహిళపై రేప్..
బీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అనుగ్రహ్ నరైన్ మగధ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో మహిళను చేర్పించారు. ’25ఏళ్ల బాధితురాలు పంజాబ్ లోని లూధియానా నుంచి బీహార్ లోని గయా జిల్లాకు వచ్చింది. ఆ ప్రయాణం సమయంలో మహిళకు రెండు నెలల గర్భిణీ అబార్షన్ అయింది. అతిగా రక్త స్రావం అవుతుండటంతో ఆమెను గయాలోని హాస్పిటల్లో చేర్పించారు. మార్చి 27న ఆమెను అనుగ్రహ్ మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందిగా సూచించారు. అక్కడే మహిళపై ఏప్రిల్ 2, 3 తేదీల్లో డాక్టరే అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల తర్వాత కరోనా టెస్టు ఫలితం నెగెటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భయంగా ఉండటంతో అత్తయ్యకు జరిగిన విషయం చెప్పింది. ఐసోలేషన్ వార్డులో డాక్టర్ తనతో ప్రవర్తించిన తీరును వివరించింది. ఏప్రిల్ 6న ప్రాణం కోల్పోయింది. ఘటనపై స్పందించిన పోలీసులు మహిళ అత్తయ్యను హాస్పిటల్ కు వచ్చి వైద్యుడ్ని గుర్తించాలని కోరారు. హాస్పిటల్ సూపరిండెంట్ ఇది చాలా సీరియస్ విషయమని తేలిగ్గా విడిచిపెట్టకూడదని సూచించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నేరస్థుడికి తగిన శాస్తి చేయాలని వెల్లడించారు.