ఓజోన్ పొరకు భారీ రంధ్రం..
ఉత్తర దృవంపై ఓజోన్ పొరకు ఎన్నడూ లేనంత భారీ రధ్రం పడ్డట్టు శాస్త్రవెత్తలు తెలిపారు. ఇది గ్రీన్ ల్యాండ్ కంటే మూడు రెట్ల విస్తీర్ణం ఎక్కువగా ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇది మరింత పెద్దదైతే ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడతాయని, చర్మ సంబంధమైన వ్యాధులు, క్యాలరాక్ట్ వంటి రోగాలు వస్తాయని అన్నారు. కానీ.. ఇది తొందరలోనే పూడుకుపోయే అవకాశాలు కన్పిస్తున్నాయని తెలిపారు.
ఓజోన్ పొర సూర్యుని నుంచి విడుదలయ్యే హానికర అతినీలలోహిత కాంతిని గ్రహిస్తాయని… అయితే ఈ పొరలో మామూలుగా అప్పుడప్పుడూ రంధ్రాలు ఏర్పడతాయని తెలిపారు శాస్త్రవేత్తలు. అర్కిటిక్ ప్రాంతంలో ఇంత పెద్ద రంద్రాన్ని గుర్తించడం ఇదే తొలిసారని అన్నారు. వాతావరణ కాలుష్యం వలన ఓజోన్ పొర రోజు రోజుకూ పలుచన అవుతుందని తెలిపారు. ప్రతీ సంవత్సరం అంటార్కిటికా పై కాలుష్య మేఘాలు ఏర్పడటం వలన ఓజోన్ పొరలో చిన్నపాటి రంధ్రాలు ఏర్పడతాయని అయితే ఇప్పుడు అర్కిటిక్ లో ఏర్పడటం అరుదని అన్నారు.
ఓజోన్ పొర ఎక్కువ మొత్తంలో దెబ్బతింటే మానవాళి కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికైనా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు నడవాలని కోరారు. అయితే భవిష్యత్తులో సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు భూమికి చేరినట్టయితే.. పంటలు దెబ్బతింటాయని… వృక్షజాతుల్లో సమతుల్యం దెబ్బతింటుందని… సముద్రాల్లో నాచు నశించి జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. ప్రస్తుతం కరోనా వలన మానవాళి ఎలాగైతే ఇబ్బంది పడుతుందో అలాగే ఓజోన్ పోర దెబ్బతిన్నా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు శాస్త్రవేత్తలు.