రానున్న రోజుల్లో బద్దలు అవ్వడానికి సిద్ధంగా ఉన్న కర్నూల్ కరోనా అగ్నిపర్వతం…??


కర్నూల్ వైసీపీ MLA హఫీజ్ ఖాన్ అధికార దుర్వినియోగం,రాజకీయ ఒత్తిడులకి అక్కడి కలెక్టర్, SP లు తలొగ్గారా అంటే… ప్రస్తుత వాస్తవ పరిస్థితులు చూస్తూఉంటే అవుననే అంటున్నారు అక్కడి సామాజిక విశ్లేషకులు, వైద్య నిపుణులు… ఈ కఠోర వాస్తవాలను *ఆంధ్రజ్యోతి* ఒక్కటే ఓ కథనాన్ని ప్రచురించిందని… మిగిలిన ప్రసార మాధ్యమాలు కూడా చూసీ చూడనట్టు వదిలేసాయి అన్న విమర్శకుడా ఉంది..

కర్నూల్ స్థానిక MLA హఫీజ్ ఖాన్ మర్కజ్ నుండి వచ్చిన వారిని, వారి కాంటాక్ట్స్ ని అక్జడి అధికారులు సకాలంలో గుర్తించనీయకుండా తన అధికార బలం, బలగంతో గత 15 రోజుల క్రితం చేసిన తప్పులు, ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అన్న కఠోర విమర్శలు నిజమే అయితే… ఇది అత్యంత విచారకరం..

ప్రవేట్ డాక్టర్ లు OP చూడకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా… MLA హఫీజ్ ఖాన్ కు చిరపరిచితుడైన, కర్నూల్ లో ప్రముఖ వైద్యుడు ఇస్మాయిల్ హుస్సేన్ , KM అనే ప్రయివేట్ హాస్పిటల్ అధినేత ఈ నెల 10వ తేదీ వరకు తన హాస్పిటల్ లో OP ని స్వయంగా నిర్వహించాడు… శ్వాస సంబంధ ఇబ్బందులతో ఈ నెల 14 న మరణించాడు డా||హుస్సేన్..
సదరు డాక్టర్ మరణానికి 15 రోజుల ముందు వరకు సుమారు 4 వేల మందికి పైగా వైద్యం చేసినట్టు అనుమానిస్తున్నారు అక్కడి అధికార యంత్రాంగం…

*స్థానికుల అనుమానం ప్రకారం..* మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి తన హాస్పిటల్ లో రహస్యంగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా నే ఈయన కి కరోనా వచ్చినదని అక్కడి ప్రజల బలమైన నమ్మకం… *కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్* కు మరణించిన డా|| హుస్సేన్ స్వయానా మామగారు.

MLA కి సన్నిహితుడనే కారణం తో ప్రైవేట్ ఆసుపత్రిలో… ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతూ ఉంటే… అక్కడి SP, కలెక్టర్ లు పట్టించుకోని పర్యవసానమే… ప్రస్తుతం అక్కడ వైద్యసేవలు పొందిన వారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఇచ్చిన పత్రికా ప్రకటన.. అనే విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి…

డా|| ఇస్మాయిల్ హుస్సేన్ కి కరోనా పరీక్షలు జరిపి 11 వ తారీఖు న కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు..
అదే శాంపిల్ ని హైదరాబాద్ పంపిస్తే *కరోనా పాజిటివ్* అని వచ్చిందిని సమాచారం??

About The Author