క్యాన్సర్ రోగికి మందులు అందజేయడానికి 800 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీస్…


క్యాన్సర్ రోగికి మందులు అందజేయడానికి లాక్‌డౌన్ లో 800 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీస్ కానిస్టేబుల్
భారతదేశంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందటం చేత దేశం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించబడింది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా అత్యవసర సేవలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అంతే కాకుండా ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను ఇంత రాష్ట్రాలలోకి రాకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బెంగళూరు నుంచి ధార్వాడలో ఉన్న ఒక గుర్తు తెలియని క్యాన్సర్ రోగికి మందులు అందజేసి తన ఉదారతను తెలుపుకున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందా.
కోవిడ్ -19 మహమ్మారి ఫలితంగా లాక్ డౌన్ ఏర్పడింది. ఇది సాధారణ ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రజలు నిత్యావసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా ఇతర వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఇది మరింత కఠినతరంగా మారింది.కరోనా వైరస్ వ్యాపించడం వల్ల దేశంలో ఉన్న ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఒక క్యాన్సరా పేషంట్ కి అత్యవసరమైన మందులను అందించడానికి ముందుకు వచ్చాడు.
బెంగుళూరు మునిసిపల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి ఈ మందులను డెలివరీ చేయడానికి హోండా యాక్టివాలో దాదాపు 860 కిలోమీటర్లు ప్రయాణించారు. 47 ఏళ్ల వయసున్న ఒక హెడ్ కానిస్టేబుల్ క్యాన్సర్ రోగికి మందులు అవసరమని న్యూస్ ఛానల్ ద్వారా విన్నారు.హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి న్యూస్ ఛానెల్‌తో సంప్రదింపులు జరిపి ఆ రోగికి సహాయం చేస్తానన్నాడు. కుమారస్వామి బెంగళూరులోని డిఎస్ రీసెర్చ్ సెంటర్‌తో మాట్లాడారు. ధార్వాడ్‌లోని గుర్తుతెలియని రోగికి మందులు పంపిణీ చేయడానికి అవసరమైన మందులు మరియు అనుమతులను ఏర్పాటు చేశారు.
పోలీసు అధికారి తన ప్రయాణాన్ని తెల్లవారుజామున 4:00 గంటలకు ప్రారంభించి, కేవలం 14 గంటలలోనే 432 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈ విధంగా ప్రయాణించడానికి హోండా యాక్టివా ఉపయోగించాడు.
హోండా యాక్టీవా 109.19 సిసి ఇంజిన్‌ను కలిగి ఉండి, 8 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 8.74 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మ్యాన్-ఇన్-ఖాకీ తిరిగి బెంగళూరుకు ప్రయాణించాడు.ఆ పోలీస్ అధికారి ప్రయాణించిన దూరం మొత్తం సుమారు 864 కిలోమీటర్లు.హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి చేసిన ఈ చర్యకు కర్ణాటక పోలీస్ డిపార్టుమెంటులో, మరియు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అతని ప్రశంసించారు. 24 గంటల్లో 864 కిలోమీటర్ల దూరాన్ని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పుడు స్కూటర్‌లో ప్రయాణించడం గొప్ప విజయమే చెప్పాలి. ఇది పోలీసు శాఖ యొక్క ధైర్యానికి నిదర్శనం. అంతే కాకుండా అతడు అంత దూరం నిర్దిష్ట సమయంలో ప్రయాణించడానికి హోండా యాక్టివా స్కూటర్ చాలా బాగా ఉపయోగపడింది.గతంలో ప్రకటించిన లాక్ డౌన్ మరింత కఠినమైన నిబంధనలతో మే 3 వరకు పొడిగించబడింది. ఇది ప్రజలకు పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో కొంత మంది హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి వంటి వారు తప్పక సహాయం చేస్తారు. వారు అవసరమైన వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి చేసిన పని చాలా ప్రశంసనీయం.

About The Author