తెలంగాణాకు రొహింగ్యాల టెన్షన్…క్యాంప్ ల‌ నుంచి ప‌లువురు గల్లంతు…


హైదరాబాద్ – తెలంగాణాకు ఇప్పుడు మరో కొత్త టెన్షన్ ప్రారంభమైంది… హైదరాబాద్, న‌ల్గొండ‌, జిగిత్యాల జిల్లాల‌లోని లోని రొహింగ్యా క్యాంప్ ల‌లో ఉంటున్న పలువురు నిజముద్దిన్ తబ్లిగే జమాతే హాజరయ్యారు.. అలా హాజరైన వారిలో అధిక శాతం మంది ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి క్యాంపుల‌కు చేరుకోలేదు..ఈ విష‌య‌న్నాఇ కేంద్రం హోంశాఖ గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిఘా వర్గాలు తేల్చాయి. జమాత్‌కు వెళ్లిన పలువురు రోహింగ్యాలు తిరిగి క్యాంపునకు చేరుకోలేదని నిఘావర్గాలు పేర్కొ న్నాయి. దేశవ్యాప్తంగా రోహింగ్యా క్యాంపుల నుంచి జమాత్‌కు హాజరయ్యారని.. రోహింగ్యాల కదలికలను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రోహింగ్యాలందరినీ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది..హైద‌రాబాద్ క్యాంప్ నుంచి 8 మంది, న‌ల్గొండ క్యాంప్ నుంచి 6 గురు, జ‌గిత్యాల క్యాంప్ నుంచి ఒక‌రు ప‌రారైన‌ట్లు గుర్తించారు. తాజాగా వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. క్యాంప్ నుంచి ఢిల్లీకి వెళ్లి క్యాంప్ నుంచి తిరిగొచ్చిన వారితో పోలీసులు వారి కాంటాక్ట్ ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు… కాగా, ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన వారంద‌రూ ఇప్ప‌టికే క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు.. ఇప్ప‌టికీ తిరిగిరాని 15 మంది రొహింగ్యాలు ఎక్క‌డున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ముమ్మ‌రం చేసింది..

About The Author