పేదల మనసెరిగిన డాక్టరు మునస్వామి….


*స్విమ్స్* కు ఎవరినైనా పేషెంట్ ను పంపాలన్నా, అత్యంత పేద వాళ్లకు చూపించాలన్నా మొదట గుర్తొచ్చేది *డాక్టర్ శివశంకర్*, *డాక్టర్ మునస్వామిలే*… ఈరోజు డాక్టర్ మునస్వామి గారి గురించి తెలుసుకుందాం…
మీరు ఎప్పుడైనా స్విమ్స్ క్యాజువాలిటీ విభాగంలోకి వెళ్ళారా?! అక్కడ బక్క పల్చగా ఉన్న ఒకాయన… ఎప్పుడు కూల్ గా, ప్రతి పేషెంట్ తో ఓపిగ్గా ఎవరికి తగినట్టు వాళ్లతో మాట్లాడుతూ బిజీ గా కనిపిస్తారు… జబ్బు కథ ఎలా ఉన్నా … ఆయన తో మాట్లాడితే సగం తగ్గినట్లుగా రోగులు భావిస్తుంటారు…
నేను సిపీఎం కార్యాలయానికి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకి నివాసం ఉండేవాడిని… ఆ ఇంటి ఓనర్ ఎర్రయ్య ఆయన భార్య రత్నమ్మ ( ఇటీవలే మృతి చెందింది) పదిహేనేళ్ల కిందట బైపాస్ సర్జరీ చేయించుకుంది…. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి… ఆమెకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ససేమిరా ఒప్పుకోదు… మునస్వామి డాక్టర్ ఊర్లో లేకపోతే ఆయన వచ్చేదాకా అవస్థ పడుతూ ఉంటుంది తప్ప మరొకరి దగ్గర చూయించుకోదు.. అంత గురి మునస్వామి గారంటే…. ఎందుకు సార్! మీకు పేదలంటే అంత ప్రేమ? అని ప్రశ్నించామంటే… మనం ఎక్కడ నుంచి వచ్చింది మురళీ గారు… ఆన్నుంచే కదా… చదువుకున్నంత మాత్రాన ఆ వాసన పోతుందా? అంటారు… మునస్వామి డాక్టర్ కు డ్యూటీ ఉన్నప్పుడే స్విమ్స్ లో పేషంట్లను చూస్తాడనుకోబాకండి…ఆయనకు పగలు లేదు రాత్రి లేదు…. ఏ టైం అయినా తన తలుపు తడితే స్విమ్స్ కు ఆదరా….బాదరాగా వచ్చేస్తుంటారు… ప్రైవేట్ ప్రాక్టీస్ మనకెందుకులే అంటారు… స్విమ్స్ లో అయితేనే ఎక్కువమందిని చూడొచ్చంటారు… నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చిన్న మాంబట్టు గ్రామానికి చెందిన ఈ డాక్టరు ఓ చిన్న రైతు కుటుంబంలో పుట్టారు… చదువుకోడానికి ఎన్నో అవస్థలు పడ్డారు… బంధువుల సహకారంతో చదువు పూర్తి చేశారు… కులాంతర వివాహం చేసుకున్నారు భార్య ఏ. పద్మజ స్విమ్స్ నర్సింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు…. కొడుకు ఎంబీబీఎస్ చదువుతున్నారు…. తన గ్రామంలో మునస్వామి గారు దాతల సహకారంతో ఓ ఆలయాన్ని నిర్మించారు…. గంగా సమేత కాశీవిశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆలయం… దీనికి అనుబంధంగా ప్రతి పౌర్ణమి రోజున నెలకొకసారి మరియు పర్వదినాల్లో సుమారు 500 మంది ప్రజలకు కొన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు…. పలు సామాజిక కార్యక్రమాలకు తోడ్పడే… మునస్వామి కొరటాల విజ్ఞాన కేంద్రం నిర్వహించే ఆరోగ్య కేంద్రానికి కూడా మంచి సహకారం అందించారు…. డాక్టర్ మునస్వామి గారిని సి ఐ టి యు తరఫున హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను…
*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*

About The Author