మతం లేని మానవత్వం అంటే ఇదే… ఎవరో తెలియని క్యాన్సర్ బాలిక కోసం ఓ వ్యక్తి సాహసం…


సాయం చేసే మనసుకు కులమతాలు వుండవు. ఎవరో తెలియని క్యాన్సర్ సోకిన నాలుగేళ్ళ బాలిక కోసం మందులు తీసుకుని 150 కి.మీ విష్ణు అనే సెక్యూరిటీ గార్డు ప్రయాణం చేసి ఆ బాలికను కాపాడాడు. నాలుగేళ్ల నూర్ అనే బాలిక కేరళలోని అలకూజ ప్రాంతంలో బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతోంది. ఇటీవలే కీమో థెరపీ చేయించుకుంది. ప్రతిరోజు 6 గంటల సమయంలో వాడాల్సిన మందులు అయిపోయాయి. ఆ మందు వాడకపోతే కలిగే నరకయాతన అంతా ఇంతా కాదు. దాని కంటే చావే నయమనిపిస్తుంది. ఆ మందులు అయిపోవడం, అవి త్రివేండ్రంలోని రీజనల్ క్యాన్సర్ సెంటర్ లోనే అవకాశం వుండడంతో బాలిక పరిస్థితి సాయంత్రానికి దారుణమైంది. ఆ బాలిక దారుణ పరిస్థితిని గమనించిన పక్కింటి కానిస్టేబుల్ ఆంటోనీ త్రివేండ్రంలోని తన స్నేహితుడు విష్ణుకు ఫోన్ చేసి అవకాశం వుంటే మందులు తీసి పంపించాలని కోరాడు. మందులు తీసుకున్న విష్ణు వాటిని ఎలా పంపించాలన్న విషయంలో రెండో ఆలోచనే చేయకుండా రాత్రి ఒంటి గంటకు మోటరు సైకిల్ లో బయలుదేరి 150 కి.మీ ప్రయాణించి ఆ బాలికకు అందచేశాడు. ఆ బాలిక పేదరికం చూసి డబ్బులు కూడా తీసుకోలేదు. దీనిపై బాలిక నూర్ తల్లి స్పందిస్తూ తాను బతికున్నన్ని రోజులు చేసే నమాజులో విష్ణును, పక్కింటి ఆంటోనీని చల్లగా కాపాడాలని కోరుకుంటానని తెలిపింది.

About The Author