ప్పానీయంపోషకలం…
రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రజలంతా ‘కధా’ తాగాలని ప్రధాని కోరారు. వనమూలికలు, సుగంధ ద్రవ్యాల సమ్మేళనమైన ఈ ఆయుర్వేద పానీయాన్ని ఎలా తయారుచేయాలంటే..
*కావాల్సినవి:* తులసి ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలు- టేబుల్ స్పూన్ చొప్పున, ఎండుద్రాక్షలు- పది, నీళ్లు- మూడు కప్పులు, నిమ్మరసం- కొద్దిగా.
*తయారీ:* నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, యాలకులను మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కాక సిద్ధం చేసుకున్న పొడి వేసి కలపాలి. తర్వాత తులసి ఆకులు, ఎండుద్రాక్షలు కూడా వేసి అయిదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. చివరగా నిమ్మరసం పిండాలి. రుచి కోసం దీంట్లో కొద్దిగా తేనె లేదా బెల్లం కలపొచ్చు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ పానీయాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా పోరాడే శక్తి శరీరానికి అందుతుంది.