నాడు 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది..! నేడు దశాబ్దాల కల సాకారమైంది…!!


– సీఎం కేసీఆర్ గారి అకుంఠిత దీక్షా ఫలించింది.
– కాళేశ్వరం గోదారమ్మ తరలి వచ్చి రంగనాయకుని సన్నిధికి చేరింది.
– గోదావరి జలాలతో పురిటి గడ్డ పుణీతమైంది.
– సిద్దిపేట జిల్లా రైతుల సాగునీటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి ‘సూర్య చంద్రులు’ ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
– ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట ప్రాంతం రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా మారింది.
– సమైక్యా రాష్ట్రంలో సిద్దిపేట ప్రాంత రైతులు సాగునీరు గురించి అప్పటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు కదా..! కనీసం ఆలోచించలేరు.
– సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు బలయ్యారు.లెక్క లేనంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరెంట్ కష్టాలతో తల్లడిల్లారు.
– పంటలకు సాగునీరు లేక రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. ఎన్ని బోర్లు వేసిన నిరందక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దుబ్బాక ప్రాంతంలో ఎన్నో ఆకలి చావులు మన కళ్లతో చూసాం.
– భూమిని నమ్ముకొని జీవించే రైతులకు పురుగు మందు పెరుగన్నం అయింది.
– భూములు త్యాగం చేసిన రైతులకు ప్రాజెక్టు సేకరణ చరిత్రలో ఒక్క కేసు లేకుండా ఎన్నడూ లేని విధంగా భూములిచ్చిన తక్షణమే నష్ట పరిహారం చెక్కులను అందజేశారు.
– మరో వైపు ప్రాజెక్టుల నిర్మాణం లో ముంపుకు గురైన రైతుల కుటుంబాలకు ఇంటికి పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెలించారు. వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద యుద్ధప్రాతిపదికన ఇండ్లను నిర్మించి ఇవ్వడం కూడా జరిగాయి.
– కుటుంబం లో పెళ్లైన యువతి యువకులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడం జరిగింది.
– నిర్మించిన ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకొనే హక్కును ఆయా గ్రామాల రైతుల కు అందజేయడం జరిగింది.
– ఈ సందర్భంగా భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న.
– వారి త్యాగాలు మరువలేనివి. త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడి ఉంటుంది.
– రంగనాయక సాగర్ ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71వేల 516 ఎకరాల కు సాగునీరు అందుతుంది. నియోజకవర్గంలో చెరువులను, కుంటలను పూర్తి స్థాయిలో నింపుతాం.
– ఇక రైతులు వాన కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు.
– బోరు వేస్తే నీళ్లు పడతాయ లేదా అని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
– మూడు కాలాలు పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
– కాలువల ద్వారా వచ్చే నీటితో రైతుల భూముల్లో పసిడి పంటలు పండుతాయి.దిగుబడి పెరుగుతుంది.
– ఈ ప్రాంతం బహుముఖంగా అభివృద్ధి చెందుతుంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
– రైతులకు ఒక వైపు నుండి ప్రభుత్వ పెట్టుబడి సాయం, ఉచిత కరెంట్, సాగునీరు ప్రధానమైనవన్నీ ప్రభుత్వం నుండి సమకూరడం వల్ల ఇక రైతులు అప్పుల చేయాల్సిన పరిస్థితి ఎంత మాత్రం ఉండదు.
– రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు..ఈ ప్రాజెక్టు వల్ల చేపల పెంపకం పెరిగి మత్స్యకారుల జీవుతాల్లో వెలుగులు నిండుతాయి.
– పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయి. నీళ్లు వచ్చిన చోటికి పరిశ్రమలు వస్తాయి.
– పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది.చదువుకున్న యువకులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దక్కుతాయి.
– సిద్దిపేట ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందుతుంది.
– నీటితో అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి.ప్రజలకు స్వచ్ఛ మైన త్రాగునీరు లభిస్తుంది.
– తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతం అయింది.
– నాడు 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. నేడు దశాబ్దాల కల సాకారమైంది.
– రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతుల జీవితాల్లో గొప్ప వెలుగువస్తుంది.
– ఈ మహా జల కృతువు లో భాగస్వామి అయినందుకు నా జన్మ చరితార్థం అయింది.
– ఈరోజు కోసం మనం ఎన్నో శతాబ్దాల నుండి ఎదురుచూస్తున్నం. మన కష్టాలు, మన రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయా..? మన బీడు భూముల్లో గోదావరి జలాల గళ గళలు ఎప్పుడు వినిపిస్తాయా..?! మన ప్రాంత కరువు శాశ్వతంగా ఎప్పుడు పరిష్కారమవుతుందా..?? అని ఇన్నేళ్ల నుండి వెయ్యి కళ్లు చేసుకొని ఎదురు చూసినం.
– ఈ మహా జల యజ్ఞంలో భాగస్వామ్యం అయ్యే మహా భాగ్యం నాకు దక్కినందుకు నేను పొందుతున్న ఆనందానికి అవధుల్లేవు. ఒక ప్రజాప్రతినిదిగా ఇంతకంటే పొందే సంతృప్తి మరింకేమి ఉండదని, నా జన్మధన్యమైందని భావిస్తున్నాను.
– రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణము పునాది రాయి వేసినప్పటి నుండి ఆ నిర్మాణం పూర్తయి గోదావరి జలాలు బీడు భూముల్లోకి తరలి వచ్చే సందర్భం వరకు అందులో భాగస్వామి అయినందుకు నా జన్మ సార్థకమైందని భావిస్తున్నా.
– ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమై మనందరి కృషి ఫలించి ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకవడం ఒక అరుదైన ఘట్టం. ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ పనితీరు కు ఒక గొప్ప నిదర్శనం.

– మీ హరీష్ రావు.

About The Author