రైతే ఈ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం


– దేశంలో 30 వేల కోట్లతో పంటలు కొంటున్న రాష్ట్రం ఏదన్నా ఉందా ?
– సీఎం కేసీఆర్ గారు మూడున్నరేళ్లలో కాళేశ్వరం నిర్మించారు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారు, పాలమూరు – రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు చేపట్టారు
– బీజేపీ నేతలు ఏ ప్రాజెక్టుకయినా కేంద్రం నుండి మూడు రూపాయలు తెచ్చారా ?
– మద్దతుధరపై కొనుగోలు కోటా పెంచాలని పదే పదే కేంద్రాన్ని కోరుతున్నది బీజేపీ నేతలకు తెలియదా ?
– బీజేపీ నేతలు కేంద్రంలోని తమ ప్రభుత్వంతో పోరాడి సాధించిన ఒక్క పని చూపాలి
– కరోనా విపత్కర పరిస్థితులలో కూడా రైతుల చేతికష్టం మట్టిపాలుకాకూడదని గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు తెరిచి కొంటున్నాం
– ఇప్పటివరకు 4996 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,08, 5237 మెట్రిక్ టన్నుల ధాన్యం, 935 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,89,353.90 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 84 కొనుగోలు కేంద్రాల ద్వారా 56,019.6 మెట్రిక్ టన్నుల పప్పుశనగ, 11 కేంద్రాల ద్వారా 2803.7 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేశారు
– అవసరాన్ని బట్టి కొనుగోలుకేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం
– తెలంగాణ ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం
– తెలంగాణలో రైతులదే రాజ్యమని కేసీఆర్ గారు చెప్పారు
– బీజేపీ నేతలు పసుపు బోర్డు కోసమో, పసుపుకు మద్దతుధర కోసమో, కాళేశ్వరానికి జాతీయహోదా కోసమో, రాష్ట్రానికి నిధుల కోసమో, పంటల మద్దతుధర కోటా పెంపుకోసమో దీక్షలు చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు
– ప్రచారం కోసం, అధిష్టానం మెప్పుకోసం కార్యక్రమాలు చేయడం మాని చిత్తశుద్దితో కేంద్రాన్ని ఒప్పించి ఏదయినా సాధించుకొస్తే మనస్ఫూర్థిగా స్వాగతిస్తాం
– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

About The Author