రంజాన్ ఎఫెక్ట్.. బేగం బజార్‌లో గుంపులుగా జనం…


హైదరాబాద్: మరో రెండు రోజులలో రంజాన్ మాసం మొదలుకానుంది. దీంతో ముస్లింలు భారీగా బేగం బజారుకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం వారంలో కొన్ని గంటలపాటు లాక్ డౌన్ నుండి మినహాయింపు నిచ్చింది. అయితే భౌతిక దూరం పాటించాలని.. కరోనా నుండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాధారణంగానే బేగంబజార్ ఖజూర్ మార్కెట్‌ ప్రాంతంలో ఉదయం 8 నుంచి 9.30 వరకు చాలా రద్దీగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపును ఆసరాగా చేసుకున్న ప్రజలు, దుకాణాలకు వచ్చే వాళ్లు భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. స్థానికులు గుంపులు గుంపులుగా దుకాణాల‌కు పోటెత్తుతున్నారు. అలాగే రామ్ ఇడ్లీ బండి లేన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా నేపథ్యంలో స్థానికులు భయభ్రాంతులకు గురవతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

About The Author