అమ్మ చెప్పిన “భూచోడు” – ప్రభుత్వం చెప్తున్న “కరోన”
చిన్నప్పుడు తొందరగా పడుకోకపోతే తల్లులు “భూచోడు” వస్తాడు అని బయపెట్టే వాళ్ళు….
ఆ రోజు అమ్మలు అబద్దం చెప్పి మభ్యపెట్టారని కొన్నాళ్ళకు అర్థం అయ్యింది….
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక ప్రభుత్వాలు “కరోన” భూచి చూపిస్తూ మనల్ని మభ్యపెడుతూ, ఆర్థిక, సామాజిక వ్యవస్థని ఇంకా దిగజార్చుతూ ఉన్నారని ‘కరోన’ మరణాలు చూస్తే అర్థమవుతుంది….
భారతదేశం లో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలలో 63% … 60 స౦. కంటే పైబడిన వయస్సు వాళ్ళని భారత ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించింది.
ఇటలీ లో ఇప్పటివరకు ‘కరోన’ మరణాలు 60 స౦. కంటే తక్కువ వయస్సువాళ్ళు కేవలం 4.2% మాత్రమే…. 60 – 70 స౦. మధ్య వయసు ఉన్నవారు 9.9% కాగా 80 స౦ పైబడిన వృద్దుల్లోనే ఎక్కువ మరణాలు 82% కంటే ఎక్కువ నమోదు అయ్యాయి.
అదే అమెరికాలో అయితే 45 స౦. కంటే తక్కువ వయస్సు వాళ్లలో ‘కరోన’ మరణాలు 4.9% మాత్రమే. 45 -64 స౦. వయస్సు ఉన్న వాళ్ళ మరనాలరేటు 23.1% గా నమోదు అయ్యింది. అలాగే 75 స౦. పైబడిన వృద్దుల్లో 47.7% కంటే ఎక్కువని న్యూయార్క్ హెల్త్ వారు 22 ఏప్రిల్ న ప్రకటించారు.
జరిగిన కరోన మరణాలు పరిశీలిస్తే వృద్దులు, అనారోగ్యం, ఊబకాయం, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్లు ఎక్కువని స్పష్టం అవుతుంది….
60 స౦ పైబడి అనారోగ్యంతో ఉన్న వాళ్ళను హోమ్ క్వార౦న్టైన్ చేసి ఎక్కువగా జనసమర్థత ఉండే ప్రాంతాలను మూసివేసి… ప్రజాపంపిణీ వ్యస్థను , పర్రిశ్రమలు, వ్యవసాయం,ఉత్పత్తి రంగాలను యధావిధిగా జరగవివ్వాల్సింది.
లాక్డౌన్ పేరుతో ప్రజాజీవితాన్ని , ఆర్థికావ్యవస్థను విర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని వ్యవహరించకపోతే పెను ముప్పును ఎదుర్కొనక తప్పదు.