నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో రైతు బజార్లు
– కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మార్కెట్ యార్డ్ లలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు
– కరోనా వైరస్ కి ముందు రాష్ట్రంలో కేవలం 100 రైతు బజార్లు.
– కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తాత్కాలిక రైతు బజార్లతో వాటి సంఖ్యను 417 పెంచిన ప్రభుత్వం.
– వీటికి కూడా అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో మొబైల్ రైతుబజార్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
– ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల ఆర్టీసీ బస్సులను రైతు బజార్ లో నిర్వహిస్తున్న ప్రభుత్వం
– తాజాగా మార్కెట్ యార్డ్ గోడౌన్లు, ప్లాట్ ఫారాల పై కూరగాయలు, పండ్ల విక్రయాలకు నిర్ణయం.
– రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్ యార్డ్ లు.
– ప్రస్తుతం ఈ యార్డులలో కొనసాగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు
– నిత్యం రైతులు, హమాలీలు, ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిపి రోజుకి 200 మంది వరకు వ్యవసాయ యార్డ్ లకు వస్తున్నట్లు అంచనా.
– వీరితో పాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు కూడా అనువుగా వుండేలా ఇక్కడే కొత్త రైతు బజార్ల ఏర్పాటు
– కరోనా వైరస్ విస్తరించకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు
– మార్కెట్ కమిటీల పరిధిలో మేజర్ పంచాయతీ ల్లో పరిస్థితులను బట్టి రైతు బజార్ లో ఏర్పాటు.
– గోడవున్ లు లేని మార్కెట్ యార్డ్ లలో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశాలు.
– గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లో జనావాసాలకు దూరంగా, కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశం లేని యార్డ్ లకు మినహాయింపు