కరోనా విజృంభణతో చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి కకావికలం అవుతోంది..


80వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి..

ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ప్రకటించారు.

*పాలు, మందులు, నిత్యావసరాలు ఇంటి వద్దకే వలంటీర్లతో అందించనున్నారు..*

పట్టణం నుంచి ఉద్యోగుల రాకపోకలను నిషేధించారు.

ఉదయం 6నుంచి 9గంటల వరకు బయటకు వచ్చే వెసులుబాటును పూర్తిగా రద్దు చేశారు.

*పెట్రోల్‌ బంకులను కూడా మూసేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నారు..*

గురువారం రాత్రి పట్టణంలో పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి, మైక్‌ అనౌన్స్‌మెంట్‌ ద్వారా ప్రజలకు సంపూర్ణ లాక్‌డౌన్‌కు సంబంధించిన హెచ్చరికలు చేశారు. 

About The Author