ఇంటికి వెళ్లి.. బర్త్‌డే జరిపించి.. అమెరికాలోని కొడుకు విన్నపం …


ఇంటికి వెళ్లి.. బర్త్‌డే జరిపించి.. అమెరికాలోని కొడుకు విన్నపం మేరకు నేరేడ్‌మెట్‌లో ఉంటున్న అతడి తల్లి పుట్టిన రోజు వేడుకలను పోలీసులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ రంజీ మాజీ క్రికెటర్‌ దివంగత టీ.విజయ్‌పాల్‌ భార్య కుట్టిపాల్‌(60) రిటైర్డ్‌ టీచర్‌. నేరేడ్‌మెట్‌లోని సైనిక్‌పురిలో ఒక్కరే నివసిస్తున్నారు. కొడుకు ఆల్‌ఫ్రెడ్‌ ఆష్టర్‌పాల్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో ఉంటున్నారు. ప్రతి ఏడాది వారు నగరానికి వచ్చి తల్లిపుట్టిన రోజును నిర్వహించి, సరదాగా గడిపేవారు. ఈసారి అమెరికా లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో భారత్‌కు రాలేని పరిస్థితి. దీంతో శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తికి ఈమేరకు సోషల్‌ మీడియా ద్వారా విషయాన్ని వివరించారు. తమ తరఫున పోలీసులను ప్రతినిధులుగా పంపించి తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కొడుకు డీసీపీకి విన్నవించాడు. స్పందించిన డీసీపీ నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామికి సమాచారం ఇచ్చారు. సీఐ, సిబ్బందితో సైనిక్‌పురిలోని కుట్టిపాల్‌ ఇంటికి వెళ్లి.. బర్త్‌డే శుభాకాంక్షలు జరిపించారు. పండ్లు, మాస్క్‌లు, శానిటైజర్‌ను అందజేసి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author